దేవాలయంలో బూతు ఉద్యోగులు: మందు, మహిళలతో రాసలీలలు

విశాఖపట్నం: వెంకటేశ్వర స్వామి ఆలయ సత్రంలో మందు, మహిళలతో రాసలీలలు చేస్తున్న సిబ్బంది అడ్డంగా దొరికిపోయిన సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సత్రంలో బుధవారం రాత్రి అపచారం చోటు చేసుకుంది.

ఈ విషయం గురువారం ఉదయం వెలుగు చూసింది. గురువారం ఉదయం 10 గంటలకు కొందరు స్థానికులు సత్రానికి వెళ్లి చూసేసరికి ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఒకరు మద్యం మత్తులో కనిపించారు. బుధవారం రాత్రి ఆ ఉద్యోగి ఒక మహిళతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

ఆలయ సత్రంలో జరిగిన రాసలీలల వేడుకలో మొత్తం ముగ్గురు ఆలయ సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరిని టీటీడీ ఉద్యోగి వెంకట రమణ మూర్తిగా గుర్తించారు. ఇది ఇలా ఉంటే దేవాలయంలో అసాంఘిక కార్యకలాపాలపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని టీటీడీ అధికారి ఒకరు చెప్పారు.

Sociopaths activities at upamaka venkateswara swamy temple

టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహాణలో ఉంది. కాగా, ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా రోడ్డుపక్కన ఈ సత్రం ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి ఇక్కడ వసతి కల్పించారు. ఉత్సవాల అనంతరం సిబ్బంది వెళ్లిపోయారు.

బుధవారం రాత్రి ఈ సత్రంలోకి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది ఒక మహిళను తీసుకువచ్చారు. టీటీడీ ఉద్యోగిగా ఉన్న వెంకటరమణమూర్తితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించి ఆ మహిళతో రాసలీలల్లో కొనసాగించారు. మూర్తి ఆ మహిళతో రాసలీలలు జరుపుతున్న సమయంలో మిగతావారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

ఆయన్ని కావాలనే ఇరికించేందుకు వారు ఈ పని చేసినట్టుగా భావిస్తున్నారు. అయితే ఆలయ సత్రంలో అపచారానికి పాల్పడిన వారిపై విచారణ జరిపించి, బాధ్యతులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారి ఒకరు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+