హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోర్స్ కోడ్ దొంగతనం: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Software engineer held for stealing source code
హైదరాబాద్: సికింద్రాబాదులోని కుషాయిగుడాలో గల ఎంఐసి ప్రభుత్వ రంగ సంస్థ మాజీ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అధికారులు అరెస్టు చేశారు. పేటెంట్ సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించి, బెంగళూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంఐసి మాజీ జనరల్ మేనేజర్ బి. వెంకటరమణ వాంగ్మూలం మేరకు ఎంఎన్ఎస్ శ్రీనివాస్‌ను సిఐడి అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు వెంకటరమణను సిఐడి ఆగస్టులో అరెస్టు చేసింది. తమ సంస్థకు పేటెంట్ ఉన్న ట్రూ కలర్ వీడియో డిస్‌ప్లే బోర్డను సరఫరా చేయాడనికి బెంగళూర్‌కు చెందిన జిజి ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధపడినట్లు తమ సాంకేతిక విశ్లేషణలో తేలిందని ఎంఐసి మేనేజింగ్ డైరెక్టర్ తన ఫిర్యాదులో తెలిపారు.

వెంకటరమణ, శ్రీనివాస్ మరికొందరు ఉద్యోగులు సోర్స్ కోడ్‌ను దొంగిలించడానికి కుట్ర చేశారని తదుపరి దర్యాప్తులో తేలిందని ఎంఐసి అధికారులు తెలిపారు. ట్రూ కలర్ ఎల్ఇడి వీడియో డిస్‌ప్లే పేటెంట్ సాఫ్ట్‌వేర్‌ను, టెక్నాలజీని పంపిణీ చేయడానికి వెంకటరమణ వివిధ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు.

English summary
A former senior software engineer of public sector company, MIC, Kushaiguda, was arrested on Thursday for allegedly stealing the source code of a patented software and sharing it with a Bangalore-based private company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X