వందే భారత్ ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్
వందేభారత్ త్వరలోనే మరో రెండు రంగుల్లో కనిపించబోతోంది. ఒకటి కాషాయ రంగు కాగా, మరొకటి బూడిద రంగు ఉంటుంది. ఈ రెండు రంగులు వందే భారత్ పై ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రంగులను ఎంపిక చేసినట్లు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లు తిరుగుతుండాలి. కానీ ప్రస్తుతం తిరుగుతున్నవి 25. చెన్నై మినహా ఇతర రైల్వే ఫ్యాక్టరీల్లో తయారీ పనులు మొదలుపెట్టకపోవడమే దీనికి కారణం. 2024 మార్చికి 77 రైళ్లు తయారుచేసి ఇచ్చేలా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు వచ్చాయి. ఒక ప్రొటో టైప్ రైలు (నమూనా రైలు) తయారవడానికి నెలరోజుల సమయం పడుతోంది. వందే భారత్ ఏసీ స్లీపర్ రైలు పనులు జవనరిలో ప్రారంభించి ఫిబ్రవరికల్లా కొత్త వెర్షన్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3ఏసీ 11, 2ఏసీ4, 1ఏసీ1 బోగీలుండేలా డిజైన్ చేశారు. ఇది తయారుచేసే సమయంలోనే మెట్రో నమూనాను రూపొందించాలని చూస్తున్నారు.

వందే భారత్ రైలులో 25 మార్పులు చేయబోతున్నారు. సీటు వాలును పెంచబోతున్నారు. ఫోన్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, మరుగుదొడ్లలో మంచి లైటింగ్, దివ్యాంగుల కోసం వీల్ చైర్లు తెస్తున్నారు. కేటరింగ్ విభాగంపై కూడా ఫిర్యాదులు రావడంతో అందులోను మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం వీటి తయారీలో 85 శాతం స్వదేశీ పరికరాలు వాడుతున్నారు. రానున్న రోజుల్లో మొత్తం 100 శాతం స్వదేశీ ఉత్పత్తులే వాడాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications