లోకేష్‌తో ఎన్నారై నేతలు: నిధికి రూ.82వేలు(ఫొటోలు)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ. 82వేలు విరాళాలను ఆ పార్టీ నేతలు నిధి కన్వీనర్ నారా లోకేష్‌కు అందజేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో నారా లోకేష్‌ను కలిసిన తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా బృందం తరపున శ్యాంప్రసాద్ రూ. 57,250ల చెక్కును అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు, మామిడికుదురు మండలం గోగన్న మఠంకు చెందిన మాజీ జడ్పిటిసి బిహెచ్ ఈశ్వర్ రాజ్‌వర్మ రూ. 25వేల నగదును విరాళాలు అందజేశారు.

ఈ సందర్భంగా విరాళాలు అందించిన వారిని లోకేష్ అభినందించారు. ఈ మేరకు వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.













Click it and Unblock the Notifications