టిఆర్ఎస్ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి: పరిస్థితి విషమం, కార్యకర్త మృతి

మెదక్: సంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి మున్సిపల్ కౌన్సిలర్ ప్రదీప్ కుమార్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ నుంచి రాజంపేటకు బైకుపై వెళ్తున్న ప్రదీప్‌పై ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో దుండగులు దాడికి పాల్పడ్డారు.

అదే సమయంలో అటువైపుగా ఓ వాహనం రావడంతో దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న బుధవారం బాధితుడిని పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని డిఎస్పీ తెలిపారు. ప్రదీప్‌ను టిఆర్ఎస్ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు పరామర్శించారు.

ప్రత్యర్థుల దాడిలో టిఆర్ఎస్ కార్యకర్త మృతి

Some thugs attacked on TRS counselor with knives

నల్గొండ: జిల్లాలోని నూతనకల్ మండలం మద్దిరాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త ఉమేశ్‌పై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. స్థానికులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉమేశ్ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య

మెదక్: జిల్లాలోని కొండపాక మండలం మరపడ్గ గ్రామంలో వెంకటేశం అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. యువకుడి స్వగ్రామం మిరిదొడ్డి మండలం జప్తులింగంపల్లి.

కాగా, మరపడ్గలోని అత్తగారింటికి మంగళవారం వచ్చాడు. మద్యం సేవించి వారితో గొడవకు దిగడంతో అతడ్ని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

రూ. 3.5లక్షల దోపిడీ

హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులను తుపాకితో కొందరు దుండగులు బెదిరించారు. అంతేగాక వారి సమీపంలో నేలపై కాల్పులు జరిపి, వారి దగ్గర ఉన్న రూ. 3.5లక్షల నగదును అపహరించారు.

ఎస్‌బిఐ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న బాలరాజు, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను కొంతమంది దుండగులు అడ్డకున్నారు. వాళ్లు తేరుకునే లోపే కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న మొత్తం 3.5లక్షల నగదును దోచుకుని పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+