కోనేరులో మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీశారు: ఆందోళన

తూర్పుగోదావరి: జిల్లాలోని పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయంలోని కోనేరులో మహిళలు స్నానం చేస్తుండగా కొందరు ఆకతాయిలు తమ సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఆ యువకులు అక్కడ్నుంచి పరారయ్యారు. పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Some youth allegedly tries to shoot video of bathing womens

కుటుంబసభ్యులు మందలించారని వ్యక్తి ఆత్మహత్య

పశ్చిమగోదావరి: అప్పు విషయమై భార్య, కుమార్తె మందలించడంతో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు 3వ వార్డులో నివాసం ఉంటున్న ప్రత్తిపాటి పెంటయ్య రజక వృత్తి చేసుకుంటూ.. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎన్‌ఎంఆర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు రూ.15 వేలు అప్పు చేశాడు.

కాగా, ఈ విషయం తెలిసి భార్య, కుమార్తె ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందని సోమవారం రాత్రి ప్రశ్నించారు. అప్పులు చేయడం తగదని మందలించడంతో ముగ్గురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో పెంటయ్య తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

మంగళవారం ఉదయం డ్యూటీకని బయలుదేరిన అతడు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్‌లో మెట్ల ప్రాంతం వద్ద గల కొక్కేనికి నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి సమీపంలోని పండ్ల వ్యాపారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పెంటయ్య మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+