జగన్ కు టీడీపీ మాజీ మంత్రి సవాల్..!!

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప్రయ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఈ ఉదయం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి, అప్పులు, భూముల కేటాయింపు, మద్యం కుంభకోణం, సూపర్ 6 పథకాల అమలులో చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం విఫలం కావడం.. వంటి అంశాలన్నింటినీ ప్రస్తావించారు. అంశాలవారీగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

Somireddy Chandra Mohan Reddy challenged YS Jagan

భూముల కేటాయింపు వ్యవహారంలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చారు వైఎస్ జగన్. ఉర్సా కంపెనీకి ఊరూ పేరూ లేదని, అలాంటి సంస్థకు విశాఖపట్నంలో ఒక రూపాయికి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఇస్తోన్నారని, దాన్ని కేబినెట్‌లో క్లియర్‌ చేశారని అన్నారు.

ఆ కంపెనీ యజమాని మానవ వనరుల అభివృద్ధి శాఖ నారా లోకేష్‌కు స్నేహితుడని జగన్ ఆరోపించారు. ఇంకా లులూ సంస్థకు మాల్‌ కట్టడానికి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమి అప్పనంగా ఇస్తోన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్జ్ ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడిగా సాగుతోందని మండిపడ్డారు.

ఇసుకను మొత్తం టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు దోచేస్తోన్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా 750 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, తాము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోందని, 80 లక్షల టన్నుల స్టాక్‌ ఇసుక పెడితే, రెండు నెలల్లో మొత్తం దోచేశారని జగన్ చెప్పారు.

ఇదే చంద్రబాబు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి, లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉందని వైఎస్ జగన్ ఆరోపించారు. అందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఉందని పేర్కొన్నారు. అయినా జంకు, బొంకు లేకుండా మళ్లీ యథేచ్ఛ దోపిడి చేస్తున్నారని విమర్శించారు.

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అని అందరినీ మభ్య పెడుతూ చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని జగన్ ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11,000 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్‌ నుంచి రూ.5,000 కోట్లు, సీఆర్‌డీఏ బాండ్ల నుంచి రూ.21,000 కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52,000 వేల కోట్ల అప్పులు చేస్తున్నారని జగన్ చెప్పారు.

ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి మరో రూ.6,000 కోట్ల రూపాయలను అమరావతికి కేటాయించారు. అమరావతి ఎక్కడ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న 50,000 ఎకరాలకు సంబంధించి ఈ మధ్య ఫైనాన్స్‌ కమిషన్‌కు చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చి, రూ.77,000 కోట్లు కావాలని అడిగారని గుర్తు చేశారు.

జగన్ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఉర్సాకు భూముల కేటాయింపుపై జగన్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 56 ఎకరాల 36 సెంట్లను ఉర్సాకు కేటాయించినట్లు వివరించారు.

తామిద్దరం ఎమ్మెల్యేలమని, ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు, ఒక రూపాయికి భూములను కేటాయించి ఉంటే పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధమని సోమిరెడ్డి సవాల్ విసిరారు. సర్వేపల్లికి తాను, పులివెందుల నియోజకవర్గానికి జగన్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును తీసుకుందామని అన్నారు.

14వ ఆర్థిక కమిషన్ పంచాయతీ నిధులను కూడా జగన్ ప్రభుత్వం ముంచివేసిందని సోమిరెడ్డి ప్రత్యారోపణలు చేశారు. యలహంకలో ఉంటూ అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి రాజకీయాలు చేయడం కాదని, ఇలాంటి ఆరోపణలను జగన్ చెబితే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+