అల్లుడు జైలుకెళ్తాడనే ఈ కుట్ర: సోనియాపై సోమిరెడ్డి

సోనియా కుట్రను జాతీయ పార్టీలు అర్థం చేసుకోవాలని కోరారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సోనియా విభజన కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల పైన ఎపి - కర్నాటక మధ్య వివాదం ఉంటే మంత్రుల బృందం (జివోఎం)లో వీరప్ప మొయిలీ ఎలా ఉంటారని ప్రశ్నించారు. 371 డిపై కోర్టులు జోక్యం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.
జగన్ కంటే ఎక్కువ సంపాదించారు: కిరణ్‌పై ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా సంపాదించారని ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు. అధిష్టానమే కిరణ్‌చే సమైక్యవాదం పలికిస్తోందన్నారు. అసెంబ్లీలో అభిప్రాయాలు తీసుకోవాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడంలో తప్పులేదన్నారు. రాయల తెలంగాణకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు. కేంద్రం మరోసారి తెలంగాణ ప్రజలను వంచించే ప్రయత్నాలు చేస్తోందని, పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
బాబు పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం యలమంచిలి దగ్గర తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమని ఆదుకోలేదని చంద్రబాబుతో రైతులు తమ ఆవేదనను వినిపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నీటి విడుదలలో ఆలస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుల రుణ మాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తానన్నారు. ఈ ప్రభుత్వం అసమర్థ, పనికిమాలిన ప్రభుత్వమన్నారు. తుఫాన్లతో రైతులు నష్టపోతున్నా పరిహారం అందటం లేదని విమర్శించారు. కాలువల ఆధునికీకరణ పేరుతో కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications