కాస్కో! మీ కథ క్లోజ్: కేసీఆర్‌కు సోమిరెడ్డి, బెయిల్ రాకుండా కుట్ర
హైదరాబాద్: తమ కథ కాదని, తెరాస కథనే ముగిసిందని ఏపీ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం ఘాటుగా మాట్లాడారు. టీడీపీ కథ, చంద్రబాబు కథ ముగిసిందన్నట్లుగా తెరాస నేతలు మాట్లాడుతున్నారని, కానీ వారి కథే ముగిసిందన్నారు.
రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెరాస నేతల్లా తాము, తమ పార్టీ అధినేత చంద్రబాబు అబద్దాలు చెప్పడం లేదన్నారు. తప్పులు సమర్థించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి పైన కక్ష సాధించేందుకు తెరాస కుట్ర పన్నిందని ఆరోపించారు. తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్ియేలు తెరాసలోకి వెళ్తే వారిని పొగడాలా అని ప్రశ్నించారు. మా నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే మాట్లాడవద్దా అని నిలదీశారు.

తెలంగాణ నగరాలను లండన్, న్యూయార్క్, డల్లాస్ చేస్తానని తెలంగాణ ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగి, ఏపీ ముఖ్యమంత్రి పైనే నిందలు వేస్తావా అని కేసీఆర్ పైన మండిపడ్డారు.
నువ్వో పెద్ద ఫైటర్.. మేం పిరికిపందలమా అని ధ్వజమెత్తారు. ఉమ్మడి హైదరాబాదులో ఆంధ్రులకు ఎలా హక్కులు లేకుండా పోతాయో తేల్చుకుందామని సవాల్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత అతనే ఆ పీఠంపై కూర్చొని మాట తప్పాడన్నారు.












Click it and Unblock the Notifications