జగన్‌వన్నీ దొంగ దీక్షలే, మోడీతో మాట్లాడే సత్తా బాబుకే: సోమిరెడ్డి
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దొంగదీక్షలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం ఏడాది తర్వాత జగన్‌కు గుర్తు వచ్చిందా అని ఆయన అడిగారు. జగన్ దీక్ష చేస్తే డాక్టర్ల సలహా మేరకే చేస్తారని ఆయన విమర్శించారు. విభజన నేపథ్యంలో ఏపీకి రావలసిన నిధులను కేంద్రాన్ని ఒప్పించైనా, మెప్పించైనా తీసుకురాగలిగే శక్తి ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని సోమిరెడ్డి అన్నారు.

చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆఆయన అన్నారు. కేవలం మూడున్నర మాసాల్లోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైనా సరే బిజెపి ప్రభుత్వంతో నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రధాని మోడీతో మాట్లాడుతారని, మోడీతో మాట్లాడే సత్తా చంద్రబాబుకు ఒక్కరికే ఉందని ఆయన అన్నారు. మోడీతో చంద్రబాబు మాట్లాడిన తర్వాత కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల నోళ్లు మూతపడుతాని ఆయన అన్నారు. మోడీతో చంద్రబాబు అన్ని విషయాలపై మాట్లాడుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications