దేశంలోనే అవినీతి పార్టీ: టీడీపీ, బాబును ఏకిపారేసిన సోము వీర్రాజు
Recommended Video

విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం, ప్రతీ కార్యక్రమంలోనూ అవినీతి చోటు చేసుకుంటోందని అన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న మెకానిజం ఏంటి? అని ప్రశ్నించారు. రూ.1120కోట్లతో అయ్యే పట్టిసీమకు రూ.1660కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీశారు. శనివారం సోము వీర్రాజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మట్టి తీయడానికే 67కోట్లు ఖర్చు అవుతుందా? అని ప్రశ్నించారు.
స్పీల్ వేలో రూ.1400 ఖర్చు ఎందుకు జరిగిందని నిలదీశారు. పంపు సెట్లకు రూ.340 కోట్ల ఖర్చు వస్తుందా?, కెనాల్ కలపడానికి గొట్టాల కోసం రూ.817కోట్లు ఎలా అయ్యిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. పట్టిసీమలో 24పంపులు వేసి, 30పంపుల డబ్బులు కాజేశారని ఆరోపించారు. మట్టి తరలించిన లారీకి రూ.4లక్షలా? అని మండిపడ్డారు.

అవినీతిని తవ్వాలంటే బుల్డోజరే కావాలి
రాష్ట్రంలో అవినీతిపై కాగ్ నివేదికే నిదర్శనమని సోము వీర్రాజు అన్నారు. తాను చెప్పేవన్నీ కాగ్ మీటింగ్ లో తేలిన విషయాలేనని అన్నారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు, పారా సరిపోదని.. బుల్డోజర్ కావాలని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని కట్టడి చేయలేని సీఎం.. జపాన్ తరహా ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

అవినీతి కమిటీలు
సీఎం చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల్లో భారీ అవినీతి చోటు చేసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.20వేల లంచం అడుతున్నారని ఆరోపించారు. కొత్త పెన్షన్ కోసం మూడు నెలల డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు. కట్టని బాత్రూంలకు ఒక్కో మండలానికి రూ.5కోట్లు కాజేశారని సోము వీర్రాజు ఆరోపించారు.

తెలుగు డ్రామా పార్టీ.. దేశంలోనే..
టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అయ్యిందని ఎద్దేవా చేశారు. దేశంలో కిందిస్థాయికి అవినీతిని తీసుకెళ్లిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. చెట్టునీరుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 27వేల కోట్లు కేంద్రం ఇస్తే.. అందులో కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. రూ. 10వేల కోట్లకు మట్టిన కూడా అమ్మేశారని సోము వీర్రాజు మండిపడ్డారు.

అవినీతి డీ సెంట్రలైజేషన్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేనని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువైపోయారని, సీఎం వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నారు. ఇసుక లారీకు రూ.2వేలు వసూలు చేస్తున్నారని.. ఈ సొమ్మంతా ఎక్కడ పోతోందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అవినీతిని డీ సెంట్రలైజ్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఎత్తిపోతలంటే నిధులు ఎత్తేయడమే
సర్వ శిక్షా అభియాన్ నిధులను కూడా అక్రమంగా వాడుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రూ.4వేల కోట్లు కేంద్రం ఇస్తే.. ట్రైనింగ్ కోసం రూ.400కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. పోలవరంలోనూ భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.పోలవరంలో గండికి రూ. 11కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం అంటే నిధులను ఎత్తేయడమేనని ఎద్దేవా చేశారు.
ఎక్స్‌పర్ట్ కమిటీకి ఆర్ఆర్ ప్యాకేజీలో అవినీతి గురించి తెలిసి ఉండదని అన్నారు.

చంద్రబాబు సెటైర్లు
తాను అవినీతిపై విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు సోము వీర్రాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు గంటలు గంటలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గంటలు గంటలు మాట్లాడితే ఆయన ఆరోగ్యాన్ని, రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని చురకలంటించారు. యూనివర్సిటీలకు కేంద్రం వందల కోట్లు నిధులిచ్చినా ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు.

హుధుద్ విషయంలోనే.. కిరణ్ లానే..
హుధుద్ కోసం రూ.25వేల కోట్ల నష్టమని ఏపీ ప్రభుత్వం చెప్పిందని, అంతేగాక, ఏయూలో అద్దాలు పగిలితే రూ.250 కోట్లు అన్నారని సోము వీర్రాజు చెప్పారు. అయితే, కేంద్రం నిధులిస్తే.. యూసీలు మాత్రం రూ.700కోట్లు మాత్రమే ఏపీ ఇచ్చిందని మండిపడ్డారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏపీని పట్టించుకోకుండా సమైక్యాంధ్ర అంటూ ఉద్యమం చేశారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అన్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications