అమరావతికి రాజధాని-విశాఖకు ఇవన్నీ.. బీజేపీ ప్లాన్ బయటపెట్టిన సోము వీర్రాజు

ఏపీలో అమరావతి రాజధానిపై కేంద్రం తాజాగా పార్లమెంటు, సుప్రీంకోర్టులో వెల్లడించిన అభిప్రాయాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దీనిపై స్పందించారు. అమరావతి రాజధానికి ఇప్పటికే మద్దతిస్తున్న తమ పార్టీ విశాఖకు ఏం చేస్తుందన్న దానిపైనా క్లారిటీ ఇచ్చారు.

ఏపీకి అమరావతే రాజధాని అనే విషయంలో బీజేపీ స్పష్టంగా ఉందని సోము వీర్రాజు వెల్లడించారు. తమకు అధికారమిస్తే ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చిన 9 వేల కోట్లు ఏమయ్యాయో తెలియదని సోము పేర్కొన్నారు. అమరావతిలోనే రాజధాని కడతానన్న జగన్ మడమ తిప్పారని సోము ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టే కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీల్ని వ్యతిరేకిస్తున్నట్లు సోము తెలిపారు.

somu veerraju reveals bjps plan- says amaravati is capital, rs.2 lakh cr to vizag

అమరావతి రాజధానికి మద్దతిస్తున్న బీజేపీ.. విశాఖకు ఏం చేయబోతోందన్న దానిపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. విశాఖలో రెండు లక్షల కోట్లతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు సోము వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని సోము ఆరోపించారు. ప్రధాని మోడీ తాజాగా విశాఖ పర్యటన సందర్భంగా శంఖుస్దాపన చేసిన ప్రాజెక్టుల్ని గుర్తుచేస్తూ సోము రెండు లక్షల కోట్ల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+