కాపులకు రిజర్వేషన్లు ఎందుకివ్వరు? అభివృద్ధి నిరోధకులుగా మారారు: ఏపీ సర్కారుపై సోము వీర్రాజు ఫైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు. ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాపులకు ఎందుకు ఇవ్వలేదని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సోము వీర్రాజు.
Recommended Video

కాపులకు రిజర్వేషన్లు ఎందుకివ్వరు?: జగన్ సర్కారుపై సోము వీర్రాజు
ముస్లింలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాపులను ఎందుకు తీసుకోలేదదని సోము వీర్రాజు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. ముస్లింలకు రాష్ట్రంలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారని, అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. వారికి ఇచ్చినప్పుడు.. కాపులకు ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు.

ఏపీకి కేంద్రంతో ఎంతో చేస్తోందన్న సోము వీర్రాజు
ఫిబ్రవరి 17న ఏపీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని, వేల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని సోము వీర్రాజు తెలిపారు. 64వేల కొట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్పారని వీర్రాజు గుర్తు చేశారు. ఇక దేశ వ్యాప్తంగా 25వేల కిలో మీటర్లు జాతీయ రహదారులను విస్తరించనున్నారని చెప్పారు. ఇందులో అధిక ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడిగి తీసుకోవాలన్నారు. టూరిజం వల్ల అనేక మందికి ఉపాధితో పాటు భూముల విలువ పెరిగిందిన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, లంబసింగి లను కలుపుతూ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు వీర్రాజు. రూ. 689 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. జాతీయ రహదారి నిర్మాణాలకు పునరావాసం, బాధితులకు నష్ట పరిహారం ఇస్తున్నామని చెప్పారు. దేవరపల్లి, కొవ్వూరు సెక్షన్‌కి రూ. 2,676 కోట్లు విడుదల చేయడం జరిగిందని వీర్రాజు తెలిపారు. రూ. 4,793 కోట్లతో రాజమండ్రి, విశాఖపట్నం వైపు మరో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారన్నారు. ఈ విధంగా ఏపీలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సోము వీర్రాజు వివరించారు.

అభివృద్ధి నిరోధకులుగా జగన్ సర్కారు: సోము వీర్రాజు ఫైర్
కాగా, నేచర్ క్యూర్ హాస్పటల్ హైదరాబాద్‌లో ఉందన్న వీర్రాజు.. 25 ఎకరాలను కేటాయించి ఏపీలోనూ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. గన్నవరం మండలంలో ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. సామర్లకోటలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్ నిర్మాణానికి గతంలో అడిగారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఆ స్థలాలను జగనన్న ఇళ్లకు కేటాయించారని చెప్పారు. ఈ చర్యతో అభివృద్ధి నిరోధకులుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వీర్రాజు విమర్శించారు. కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని మండిపడ్డారు. ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

జగన్ సర్కారు వైఫల్యాలు ప్రజల్లోకి: సోము వీర్రాజు
రాష్ట్రంలో జగన్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని సోము వీర్రాజు అన్నారు. కేంద్రం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నప్పటికీ.. వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఇక కేంద్ర హోంశాఖ విడుదల చేసిన లేఖ వివాదంపై సోమువీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం అని, 17వ తేదీన సమావేశంలో ఏపీ, తెలంగాణ ఆస్తుల అంశంపై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణకు సంబంధం లేని అంశం కాబట్టే అది తొలగించారని స్పష్టం చేశారు. హోదాపై ప్రత్యేక సమావేశం పెట్టి చర్చించాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని అంశాలలో పెట్టుబడులు తీసుకున్నారని, కేంద్రం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు ఇచ్చిందని వీర్రాజు చెప్పారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications