హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసి ఎండిగా నాటి కండక్టర్ కొడుకు పూర్ణచంద్ర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Son of bus conductor to steer APSRTC
హైదరాబాద్: ఒకప్పటి బస్సు కండక్టర్ కొడుకు ఇప్పుడు ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1988 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి పూర్ణచంద్ర రావును ఆర్టీసి వైస్ చైర్మన్, ఎండిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శనివారం ఎకె ఖాన్ నుండి ఎండిగా బాధ్యతలు చేపట్టారు.

ఆర్టీసీలో ఓ సాధారణ కండక్టర్ కొడుకు ఆ సంస్థ అత్యున్నత స్థానమైన మేనేజింగ్ డైరక్టర్ పదవిలో ఆశీనులు కావడం గమనార్హం. పూర్ణచంద్ర రావు తండ్రి జుజ్జువరపు రాధాకృష్ణమూర్తి ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. పెద్ద కుమారుడు మురళి గ్రూప్-1 అధికారిగా పనిచేస్తూ, ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

సిఎం పేషీలో ఉప కార్యదర్శి హోదాలో సేవలందిస్తూ ఇటీవలే కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. చిన్న కుమారుడు పూర్ణచంద్ర రావు 1988లో ఐపిఎస్‌కు ఎంపికై పోలీసు శాఖలో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.

తన తండ్రి కండక్టర్‌గా పని చేసిన సంస్థకు అధిపతిని కావడం ఉద్విగ్నతకు గురిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన విలేకరులతో అన్నారు. ఆర్టీసీ రుణం తీర్చుకునే తరుణం వచ్చిందని, తన తండ్రి కండక్టర్.. తాను ఆర్టీసీకి ఎండీగా పనిచేయాలంటూ ఐపిఎస్‌లో చేరినప్పటి నుంచే తన సన్నిహితులు ఆకాంక్షించేవారని, ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదన్నారు.

English summary

 Purnachandra Rao, the former additional DGP who took charge as the Vice Chairperson and MD of APSRTC on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X