దారుణం: బతికివుండగానే కన్న తల్లిని శ్మశానంలో వదిలేసిన తనయుడు
అమరావతి: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం దిగజారిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కన్న కొడుకే బతికుండగా శ్మశానంలో వదిలివెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అమలాపురం మండలంలోని పేరూరు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతరావు అనే వ్యక్తి తన తల్లి సత్యవతి (75)ని వృద్ధాశ్రమంలో వదలి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు వృద్ధాశ్రమాల్లో అనుమతి నిరాకరించడంతో ఆమెను నిర్ధాక్షణ్యంగా శ్మశానంలో వదిలి వెళ్లిపోయాడు.

దీంతో శ్మశాన వాటికలో నీరసంగా ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు ఆమె గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అమలాపురం ఎస్‌ఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వృద్ధురాలిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications