వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్తను అరెస్ట్ చెయ్యాలని సెల్ టవర్ ఎక్కిన అల్లుడి నిర్వాకం; అసలు విషయం తెలిసి షాకైన జనం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అత్తను అరెస్ట్ చేయాలని ఓ అల్లుడు హల్చల్ చేశాడు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న అత్తను అరెస్టు చేయాలంటూ ఓ అల్లుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. మదనపల్లె పుంగనూరు రోడ్డు దగ్గర డిఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా రచ్చ చేశాడు. ఇంతకీ ఆ అల్లుడు అత్త మీద ఎందుకు కోపంగా ఉన్నాడు? ఎందుకు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అన్న వివరాల్లోకి వెళితే..

ఉరి వెయ్యటం, విషం తాగటం.. ఏంటిది? టీడీపీ తీరుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ఉరి వెయ్యటం, విషం తాగటం.. ఏంటిది? టీడీపీ తీరుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్

తాగుబోతు భర్తను భరించలేక పుట్టింటికి వెళ్ళిన మహిళ

తాగుబోతు భర్తను భరించలేక పుట్టింటికి వెళ్ళిన మహిళ

మదనపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్ లో క్రాంతి, ప్రమీల దంపతులు జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన క్రాంతి కొంతకాలంగా భార్య పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు. తాగుడుకి అలవాటైన క్రాంతి తాను సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకే ఖర్చు చేస్తూ ఉండడంతో, ఎంత చెప్పినా భర్త క్రాంతి మారక పోవడంతో విసిగిపోయిన భార్య ప్రమీల పుట్టింటికి వెళ్ళింది. ఇక కాపురానికి రావాలని భార్యను ఎంత బతిమాలినా ఆమె భర్త దగ్గరకు రాలేదు. ఈ క్రమంలో క్రాంతి ఇటీవల భార్యను తీసుకెళ్లటం కోసం అత్తగారింటికి వెళ్ళాడు. ప్రమీల తల్లి భార్య కోసం వచ్చిన అల్లుడికి ఊహించని షాక్ ఇచ్చింది.

భార్య కోసం వెళ్ళిన భర్తకు అత్త ఊహించని షాక్ .. టవర్ ఎక్కిన అల్లుడి హంగామా

భార్య కోసం వెళ్ళిన భర్తకు అత్త ఊహించని షాక్ .. టవర్ ఎక్కిన అల్లుడి హంగామా

తన కూతురు తనదగ్గరే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో తన భార్యను తనతో పంపించాలని హంగామా మొదలుపెట్టిన క్రాంతి చివరికి డిఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. తన అత్తను అరెస్ట్ చేయాలని, తన భార్యను తనతో పంపించాలని డిమాండ్ చేస్తూ నానా హంగామా సృష్టించాడు. లేదంటే సెల్ టవర్ మీద నుంచి దూకుతానని బెదిరించాడు. మదనపల్లె పుంగనూరు రోడ్డు లోని డిఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ పై నుండి క్రాంతి కిందికి దించడానికి పోలీసులు నానా ప్రయత్నాలు చేశారు. తన గోడును తాను సబ్ కలెక్టర్ కు విన్నవించుకుంటానని, సబ్ కలెక్టర్ ను పిలవాలంటూ క్రాంతి డిమాండ్ చేశాడు.

అత్తపై కేసు నమోదు చేస్తామని చెప్పి సెల్ టవర్ దిగేలా చేసిన పోలీసులు

అత్తపై కేసు నమోదు చేస్తామని చెప్పి సెల్ టవర్ దిగేలా చేసిన పోలీసులు

సెల్ టవర్ ఎక్కిన భర్త ను భార్య ప్రమీల కూడా బతిమిలాడింది. తాను వస్తానని సెల్ టవర్ దిగమని రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ వినని క్రాంతి తన అత్తను, బావమరిదిని అరెస్టు చేస్తేనే కిందికి దిగుతానని భీష్మించుకు కూర్చున్నాడు. ఎవరు ఎంతగా చెప్పినా క్రాంతి వినకపోవడంతో, క్రాంతి ఎప్పుడు కిందకు దూకుతాడో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమయింది. చివరకు పోలీసులు విధిలేని పరిస్థితులలో అత్తపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పి, అతన్ని క్రిందకు దిగేలా చేశారు.

టవర్ ఎక్కిన క్రాంతికి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు

టవర్ ఎక్కిన క్రాంతికి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు

ఏది ఏమైనా కాపురం అన్న తర్వాత చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు నడవాల్సి ఉంటుంది. కానీ తాగుడుకు అలవాటు పడిన క్రాంతి భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో ఆమె భర్తను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అల్లుడు మారతాడని ఆశపడిన అత్త నిత్యం తాగుతూ వేధిస్తే తన కుమార్తెను పంపించను అని చెప్పడంతో తన తప్పును గుర్తించక పోగా, సెల్ టవర్ ఎక్కి హంగామా చేసిన క్రాంతి తీరును అందరూ తిట్టిపోస్తున్నారు. పోలీసులు క్రాంతికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆ సంసారాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.

English summary
A son-in-law created a commotion to climb the cell tower near the DSP's office on Punganur Road in Madanapalle, Chittoor district, and arrest his aunt. He demanded the arrest of his aunt who said she will not send his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X