కసాయి కొడుకు .. తండ్రి గొంతుపై కాలితో తొక్కి హతమార్చిన తనయుడు; పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
సమాజంలో మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కన్న కొడుకును పెంచుకున్న, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తండ్రినే కాటికి పంపిస్తున్న కసాయి తనయుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. రోజు రోజుకి నేరప్రవృత్తి మానవ సమాజంలో రాజ్యమేలుతుంది. ఎక్కడ చూసినా దారుణాలు, హింసాత్మక ఘటనలు అడ్డూ అదుపు లేకుండా చోటుచేసుకుంటున్నాయి. రక్త సంబంధాలను కూడా మరిచి చిన్న చిన్న విషయాలకే దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.
మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కేవలం రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వలేదని తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ తనయుడు. మంచిర్యాల జిల్లాలో భూమి కోసం తండ్రిని గెంటేశాడో కొడుకు. ఇక ఈ ఘటన మరచిపోక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సౌత్ పేరుపాలెంలో జరిగిన ఈ దారుణంలో 60 సంవత్సరాల వయసున్న తండ్రి ఉల్లంపర్తి గొంతుపై కొడుకు లాజరస్ కాలితో తొక్కి అత్యంత పాశవికంగా హతమార్చాడు.

లాజరస్ గత కొంత కాలంగా తండ్రితో ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వొద్దని తండ్రితో గొడవ పడుతున్న లాజరస్ తండ్రి ఆస్తిని తన సోదరీలకు కూడా పంచుతారని అనుమానంతో లాజరస్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం పెరిగిపోయ్తున్నాయి. బంధాల కంటే డబ్బు, ఆస్తులే ప్రధానం అనుకుంటున్న సంతానం మానవత్వం మరచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.
తల్లి దండ్రులను ఆస్తుల కోసం కడ తేర్చటం, ఆస్తుల కోసం తల్లి దండ్రులను తిండి కూడా పెట్టకుండా వేధించటం, ఇంట్లో నుండి బయటకు గెంటేయటం నిత్య కృత్యంగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిణామాలు సమాజంలో ఒక హానికరమైన వాతావరణానికి కారణంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రుల పట్ల పిల్లలు చూపిస్తున్న కర్కశత్వం ప్రస్తుతం అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications