సన్ ఆప్ చీఫ్ మినిస్టర్స్..! ముఖ్య‌మంత్రుల కొడుకుల్లో జ‌గ‌న్ స‌రికొత్త రికార్డు..!!

అమరావతి/హైదరాబాద్ : పండితుల పుత్రులు అందరూ మేధావులు కాలేరు. ఇందుకు సంబందించిన సామెత కూడా అనేక సందర్బాల్లో వినే ఉంటారు. నిజ‌మే ఆనాడు విద్యాబోధ‌న‌లు చెప్పే ఎంతోమంది గురువుల సుపుత్రులు సుద్ద‌ముద్ద‌ప‌ప్పులుగా మిగిలేవార‌ట‌. దీంతో ఆ సామెత పుట్టుకొచ్చింద‌న్న‌మాట‌. ఇప్పుడు ఆ ప్రస్థావన తేవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. స్వాతంత్రం వ‌చ్చాక‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌రువాత ఎంతో మంది ముఖ్య‌మంత్రులు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రులుగా చేశారు. సీఎం త‌న‌యులుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వార‌సులు కొంద‌రు మంత్రి ప‌దువులు మాత్రమే చేప‌ట్టారు. కాని ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టడం మామూలు విషయం కాదు. అది యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు.

ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ముఖ్యమంత్రి..! జగన్ పట్టుదలకు నిదర్శనం..!!

ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ముఖ్యమంత్రి..! జగన్ పట్టుదలకు నిదర్శనం..!!

కొందరు ముఖ్యమంత్రుల కొడుకులు ఎంపీలుగా ప‌నిచేశారు. అయితే ఎవ్వ‌రూ ఇంత‌వ‌ర‌కూ ముఖ్య‌మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌లేక‌పోయారు. కానీ తొలిసారిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించ‌బోతున్నారు. ఈ అదృష్టం తెలంగాణ సీఎం త‌న‌యుడు కేటీఆర్‌కు ద‌క్కుతుంద‌ని భావించినా.. కేంద్రంలో మోదీ ఒంటిచేత్తో మెజార్టీ సంపాదించ‌టంతో కేసీఆర్‌కు కేంద్రంలో చ‌క్రం తిప్పే ప‌నిలేకుండా పోయింది.

 లోకేష్ కు సీఎం పదవి అందని ద్రాక్షే..! బాగా కష్ట పడాలంటున్న తెలుగు తమ్ముళ్లు..!!

లోకేష్ కు సీఎం పదవి అందని ద్రాక్షే..! బాగా కష్ట పడాలంటున్న తెలుగు తమ్ముళ్లు..!!

చంద్ర‌బాబు ప్రస్తుతానికి అదికారానికి దూరం అయ్యారు. మళ్లీ పార్టీ ఎప్పుడు అదికారంలోకి వస్తుందో లోకేష్ బాబు ఎప్పుడు సీఎం అవుతారో అనే అంశం పై నమ్మకాలు మాత్రం అంతగా లేవు. అందుకు తగ్గట్టే లోకేశ్ బాబు కూడా ద‌రిదాపుల్లో సీఎం అయ్యే అవ‌కాశాలు లేన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ వేసే త‌ప్ప‌ట‌డుగుల‌పై టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. ఏపీ సీఎంగా ప‌నిచేసిన వారిలో కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి త‌న‌యుడు సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి, జ‌నార్ద‌న్‌రెడ్డి త‌న‌యుడు రామ్‌ ఉన్నారు.

ఎంతో మంది సీఎం కొడుకులు..! అందరూ నామమాత్రంగా మిగిలిపోయారు..!!

ఎంతో మంది సీఎం కొడుకులు..! అందరూ నామమాత్రంగా మిగిలిపోయారు..!!

అంతే కాకుండా చెన్నారెడ్డి త‌న‌యుడు శ‌శిధ‌ర్‌రెడ్డి, ఎన్‌టీఆర్ కొడుకు బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ రాజ‌కీయాల్లోనే ఉన్నారు. క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కానీ.. వారుసులుగా కొడుకులు, కూతుళ్లు కేవ‌లం కొంత‌మేర వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు. తండ్రికి త‌గిన త‌న‌యులుగా ఎవ్వ‌రూ గుర్తింపు తెచ్చుకోలేక‌పోయారు. క‌నీసం వారిలో ఎవ్వ‌రూ సీఎం కుర్చీపై దృష్టి పెట్టేంత‌టి సాహ‌సం చేయ‌లేక‌పోయారు

జగన్ అరుదైన రికార్ట్..! తర్వాత అవకాశం కేటీఆర్, లోకేష్ ల కేనా..!!

జగన్ అరుదైన రికార్ట్..! తర్వాత అవకాశం కేటీఆర్, లోకేష్ ల కేనా..!!

కానీ.. తొలిసారిగా ఒక సీఎం కొడుకు ముఖ్య‌మంత్రిగా కావ‌టం రాష్ట్ర చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి వ‌రుస‌లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిల‌వ‌టం నిజంగా వైసీపీ శ్రేణుల‌కు పండుగ వంటిదే. మ‌రి ఈ రికార్డు స‌ర‌స‌న చేరే వార‌సుల జాబితాలో త‌రువాతి స్థానం.. లోకేషా.. కేటీఆర్ అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+