అమరావతి పేరిట చంద్రబాబు నొక్కేశాడు!: సోనియా, హోదా కోసం రాహుల్ ఫైట్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కరానికి ప్రధాని నరేంద్ర మోడీ పైన తాము ఒత్తిడి పెంచుతామని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం నాడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
ఇందుకు సంబంధించిన పత్రాలను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేశారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సింగ్ మాట్లాడారు.
సోనియా మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో, తీసుకు రావడంలో బిజెపి, టిడిపి విఫలమయ్యాయని మండిపడ్డారు. ఏపీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. దురుద్దేశ్యపూర్వకంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు.

పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్యాకేజీల కోసం పోరాడుతామన్నారు. విభజన చట్టాల్లోని హామీలను అమలు చేయాలన్నారు. ఏపీలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి భూములు అన్యాయంగా, డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందని సోనియా మండిపడ్డారు.
ప్రత్యేక హోదా పైన తాను రాజ్యసభలో హామీ ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. బిజెపి ప్రత్యేక హోదా హామీని నెవేరుస్తుందన్న నమ్మకం లేదన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీకి మట్టి, నీరు ఇచ్చి ప్రధాని మోజీ ప్రజలను ముంచారని ఎద్దేవా చేశారు. ఏపీ సమస్యలపై పోరాడటంలో మిగతా పార్టీలకన్నా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పారు. ఏపీ సమస్యల పైన మోడీ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. హోదా పైన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు.

మోడీ అపాయింటుమెంట్ ఇవ్వలేదని నిరసన
ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ అపాయింటుమెంటును కోరారు. అయితే, ఆయన అపాయింటుమెంట్ దొరకలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద రోడ్డు పైన బైఠాయించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications