16న టికి సోనియా: డిగ్గీ, పోరాటం మాదేనన్న జైరాం

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులేనని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తమ ఎంపీలే పోరాడారని, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఎక్కడా కనిపించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆయన తెలిపారు.

కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జైరాం రమేష్ అన్నారు. తెలంగాణలో దేశంలోని అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తామని జైరాం పేర్కొన్నారు.

Sonia Gandhi will come to Karimnagar on April 16th: Digvijay

16న కరీంగనర్‌కు సోనియా

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 16న కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 17న వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ ఉంటుందని తెలిపారు.

మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో రెండో దఫాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 14 నాటికి సీమాంధ్ర అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+