మరోసారి మానవత్వం చాటుకున్న రియల్ హీరో సోనూసూద్

రియల్ హీరో సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తన సూద్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కారుకు నాలుగు అంబులెన్స్ లను అందించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూసూద్ అందించిన అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించి.. వాహనాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. అందులో సోనూ సూద్ కూడా భాగస్వామ్యం కావడం పట్ల చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబుతో భేటీ తర్వాత సోనూసూద్ మీడియాతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందని సోనూసూద్ అన్నారు. తెలుగు ప్రజలు తనను మంచి నటుడిగా తయారు చేశారన్నారు. ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదని తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఏపీ తనకి రెండో ఇళ్లు లాంటిదని.. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళేనని చెప్పారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్నారు సోనూసూద్.

sonusood donate ambulances to ap government

ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తన ఫౌండేషన్ తరుఫున అందించిన అంబులెన్సులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు, నిర్వహణ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. అందుకు తాను సిద్ధమేనని సోనూసూద్ తెలిపారు. అయితే గతంలో సోనూసూద్ జగన్ హయాంలో ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. ఈ వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోనూపై ట్రోల్స్ చేస్తున్నారు.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు సోనూసూద్. ఆ తర్వాత అనుష్క లేడి ఓరియంటెడ్ చిత్రం అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ లో జీవించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోగలిగారు. ఇక రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా సోనూసూద్ హీరోగా నటించిన ఫతేహ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించగా జాక్వెలిన్ హీరోయిన్ గా నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+