రాజమండ్రిలో 'Sorry, Mosam cheyaledu' పోస్టర్ల హల్చల్: ప్రేమికుల పనేనా?
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో ఓ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. 'సారీ మోసం చేయలేదు' అని ఇంగ్లీష్‌లో రాసివున్న పోస్టర్లు దాదాపు నగరమంతా అంటించేశారు. అయితే, ఈ పోస్టుర్లు ఎవరు అంటించారు? ఎవరి కోసం అంటించారు? అనేది చర్చనీయాంశంగా మారింది. చూస్తుంటే ఇది ఏదో ప్రేమ వ్యవహారంలానే ఉందని స్థానికులు అనుకుంటున్నారు.
'సారీ మోసం చేయలేదు' అని మాత్రమే పోస్టర్లపై ఉండటంతో ఎలాంటి క్లూ కూడా ఎవరికీ దొరకలేదు. దీంతో ఈ పోస్టర్లు ఎవరు ఎవరి కోసం? ఎందుకోసం అంటించారో తెలియక.. ఎక్కడ చూసినా ఏదో ఒక సందర్భంలో దీనిపై చర్చించుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని ఏపీ అప్పారావు రోడ్డు, అద్దేపల్లి కాలనీ, షీలానగర్ తోపాటు పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అంటించి ఉన్నాయి.

ఎవరైనా యువతి యువకుడి కోసం ఇలా చేసిందా? తను ప్రేమించిన యువతి కోసం ఎవరైనా యువకుడు ఇలా చేశాడా? అనేది చర్చ జరుగుతోంది. తనను తప్పుగా అర్థం చేసుకున్న యువతి లేక యువకుడికి ఇలా సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారా? అని మాట్లాడుకుంటున్నారు.
ఈ పోస్టర్లను చూసినవారంతా తమకు తెలిసిన వారితో ఏంటీ పోస్టర్ల గోలా? అంటూ చర్చించుకుంటున్నారు. ఈ పోస్టర్లను చూసిన యువతి లేదా యువకుడు తమ ప్రియురాలు లేదా ప్రియుడిని క్షమించారా? అనేదానిపైనా చర్చలు కొనసాగుతున్నాయి.
Recommended Video
మరోవైపు, ఈ పోస్టర్ల ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజమహేంద్రవరంలో మరో కొత్త ఒరవడికి తెరతీశారని గుసగుసలాడుకుంటున్నారు రాజమండ్రి జనం.












Click it and Unblock the Notifications