విజయవాడ,నెల్లూరు,గూడూరు ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, నెల్లూరు, గూడూరు స్టేషన్ల గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులకు అధికారులు తాజాగా ఓ అలర్ట్ ఇచ్చారు. ఈ మూడు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే మూడు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిని ఏయే తేదీల్లో రద్దు చేశారన్న వివరాలను కూడా వెల్లడించారు. కాబట్టి ఆయా స్టేషన్లలో ఈ రైళ్లను ఎక్కాలనుకునే వారు తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ విజయవాడ-గూడూరు మధ్య రాకపోకలు సాగించే 67225 నంబర్ రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 67226 నంబర్ రైలును ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే నెల్లూరు నుంచి విజయవాడకు ఈ నెల 8వ తేదీన ప్రయాణించే 17259 నంబర్ రైలును కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు-ఒంగోలు సెక్షన్ లో ఉన్న టంగుటూరు స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ మూడు రైళ్ల రాకపోకల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందులో పేర్కొన్న తేదీల తర్వాత ఆయా రైళ్లు తిరిగి యథావిధిగా రాకపోకలు సాగించబోతున్నాయి. కాబట్టి ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మేరకు అలర్ట్ ను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications