వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్..!!

|
Google Oneindia TeluguNews

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి వేళ పెరిగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగ రాష్ట్రాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్ల ను ప్రకటించింది. 30 రైళ్లను సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసింది. దాదాపుగా మూడు నెలల ముందే సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. నో రూమ్స్ కనిపిస్తున్నాయి. దీంతో, రద్దీ ఉన్న రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు..

జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు..


సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో సందడి ఎక్కువ. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు అంచనాలకు మించి ఉంటాయి. సంక్రాంతికి ప్రయాణం కోసం మూడు నెలల ముందే రైళ్ల రిజర్వేషన్లు నిండుకున్నాయి. దీంతో, కొద్ది రోజుల క్రితం రైల్వే అధికారులు 94 ప్రత్యేక రైళ్లను తెలుగు రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు ప్రకటించారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేకంగా 30 రైళ్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవి జనవరి 1 నుంచి 20 వరకు పలు ప్రాంతాల మధ్య నడవనున్నాయి. 31వ తేదీ ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ అందుబాటులోకి రానుంది.

డిమాండ్ ఉన్న ఈ రూట్లకు ప్రాధాన్యత

డిమాండ్ ఉన్న ఈ రూట్లకు ప్రాధాన్యత

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రబాద్.. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లను కేటాయించారు. ప్రధానంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ వైపు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. రైల్వే పిఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏపీ నుంచి హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో స్థిర పడిన వారు సంక్రాంతికి తమ స్వస్థలాలకు చేరుకుంటారు.అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కానీ, రైళ్లకు ప్రతీ ఏటా డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది. ఇప్పటికే పలు రైళ్లల్లో ఉన్న వెయిటింగ్ లిస్టు ఆధారంగా రూట్లను ఖరారు చేసారు.
ప్రత్యేక రైళ్లు.. మార్గాలు ఇవీ

ప్రత్యేక రైళ్లు.. మార్గాలు ఇవీ

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు 6న సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ (నం: 07048) రైలు, 7న కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌ (నం: 07049) రైలు, 7న హైదరాబాద్‌-నర్సాపూర్‌ (నం: 07019) రైలు, 10న నర్సాపూర్‌- హైదరాబాద్‌ (నం: 07022) రైలు, 9న సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్‌ (నం:07039) రైలు, 12న నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (నం: 07042) రైలు, 11, 13వ తేదీల్లో హైదరాబాద్‌- మచిలీపట్నం (నం: 07011) రైలు, 12, 14 తేదీల్లో మచిలీపట్నం- హైదరాబాద్‌ (నం: 07012) రైలు, 11న సికిందాబ్రాద్‌-కాకినాడ టౌన్‌(నం: 07035) రైలు, 13న సికింద్రాబాద్‌- నర్సాపూర్‌ (నం: 07023) రైలు, 14న నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (నం: 07024)రైలు, 16న సికిందాబ్రాద్‌-కాకినాడ టౌన్‌ (నం: 07027) రైలు, 17న కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌ (నం: 07028) రైలు, 15న సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్‌ (నం: 07031) రైలు, 18న కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ (నం: 07034) రైలు, 15, 17వ తేదీల్లో హైదరాబాద్‌- నర్సాపూర్‌ (నం: 07015) రైలు, 16, 18వ తేదీల్లో నర్సాపూర్‌- హైదరాబాద్‌ (నం: 07016) రైలు నడవనున్నట్లు ప్రకటించారు.

English summary
South Central Railway Announces 30 special Trains between Telugu sttes to meet the Sankrathi Rush.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X