సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-ఈ రోజుల్లో రద్దు..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు, విశాఖపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగంచే సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారికి రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. రైల్వే మరమ్మత్తు పనుల కారణంగా ఈ స్టేషన్ల పరిధిలో నడిచే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను వివిధ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా రద్దయిన సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఏయే తేదీల్లో రద్దయ్యాయో వివరాలను వెల్లడించారు. వీటిని ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
గుంటూరులో బయలుదేరి విశాఖకు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17239ని ఇవాళ, రేపు రద్దు చేశారు. అలాగే విశాఖలో బయలుదేరి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17240ని రేపు, ఎల్లుండి రద్దు చేశారు. దీంతో ఈ రెండు స్టేషన్లతో పాటు మధ్యలో ఉన్న స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది. వీటికి ప్రస్తుతం బుకింగ్స్ కూడ తాత్కాలికంగా నిలిపేశారు.

విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చే కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. వీటి వల్ల సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 1 నుంచి మార్చి 3 వరకూ జరిగే ఈ పనుల కారణంగా సింహాద్రి ఎక్స్ ప్రెస్ తో పాటు ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.
వీటిలో విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 12805 ను మార్చి 2వ తేదీన రద్దు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖకు నడిచే మరో రైలు నంబర్ 12806ను మార్చి 3న రద్దు చేశారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను కూడా రద్దు చేశారు. విజయవాడ డివిజన్ లో పనులు పూర్తి కాగానే అంటే మార్చి నాలుగో తేదీ నుంచి ఆయా రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగించబోతున్నాయి.












Click it and Unblock the Notifications