South Central Railway: శుభవార్త చెప్పిన రైల్వే.. పలు రైళ్లకు అదనుపు కోచ్ లు..
తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీకి చెందిన అత్యధిక మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉన్నారు. వీరంతా ఏపీకి పయణమవుతున్నారు. ఇప్పటికే మహానగరంలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లంతా సొంతూళ్లకు వెళ్లారు. మిగతా వారు కూడా ఊళ్లకు వెళ్లడానికి రైళ్లు, బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే చాలా మందికి టికెట్లు దొరకలేదు.
వారంతా ఎలా ఊరు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లలో బోగీలు పెంచాలని నిర్ణయించింది. అదనుపు బోగీలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు పలు మార్గాల్లో నడిచే రైళ్లలోఅదనపు కోచ్ లు ఏర్పాటు చేశారు. వీటిలో థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ఈ రైల్వే సర్వీసులన్నీ ఆంద్రా, తెలంగాణ మధ్యే నడుస్తున్నాయి.

అంతే కాకుండా రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. 13, 14 తేదీల్లో సికిం ద్రాబాద్-కాకినాడ, కాకినా డ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రయాణికు కాస్త ముందుగా రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్సులు, రైళ్లలోనే కాకుండా చాలా మంది కార్లలో కూడా సొంతూళ్లకు వెళ్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజ్ వద్ద కూడా కార్లు, జీపులు, బస్సులు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓటర్లందరూ సొంతూళ్ల బాట పట్టడంతో నగరంలో రోడ్లలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.












Click it and Unblock the Notifications