నారాయణాద్రి, పద్మావతి, సింహపురితోపాటు మరికొన్ని రైళ్ల టైమింగ్స్ మార్చిన రైల్వే
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని ప్రధానమైన రైళ్ల సమయాలను మారుస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా మార్చిన సమయాల ప్రకారమే ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. టైమింగ్స్ మార్చినవాటిల్లో నారాయణాద్రి, సింహపురి, పద్మావతి, నాగర్ సోల్ రైళ్లు ఉన్నాయి. ఏయే టైమింగ్స్ ప్రకారం నడుస్తున్నాయో వాటి వివరాలను తెలుసుకుందాం.
నారాయణాద్రి టైమింగ్స్
లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న నారాయణాద్రి 12734 ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి 6.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి తెల్లవారుజామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. గుంటూరుకు రాత్రి 10.55 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో బేగంపేట, బేగంపేట, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గుడూరు, వెంకటగిరి, శ్రీకళాహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

సింహపురి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్
సికింద్రాబాద్ నుంచి గూడూరు మధ్య నడుస్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ 12710 కూడా ప్రతిరోజు రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.55 గంటలకు గూడూరు చేరుకుంటుంది. గతంలో ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.05 గంటలకు బయలుదేరేది. ప్రస్తుతం గంట సమయం ముందుకు జరిపారు. విజయవాడకు తెల్లవారుజామున 3.35 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, వేదాయాపాలెం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
పద్మావతి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్
హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ 12764 టైమింగ్స్ లో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గూడూరు వరకు ఎటువంటి సమయం మార్చలేదు. గూడూరుకు ఉదయం 4.19 గంటలకు, రేణిగుంటకు 5.58 గంటలకు, తిరుపతికి 6.55 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్ లో సాయంత్రం 6.30 గంటలకు పద్మావతి బయలుదేరుతుంది.
నర్సాపూర్-నాగర్ సోల్ టైమింగ్స్
నర్సాపూర్ నుంచి నాగర్ సోల్ వెళుతున్న 17231 ఎక్స్ ప్రెస్ సమయంలో కూడా మార్పులు చేశారు. నర్సాపురంలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి విజయవాడకు మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ కు సాయంత్రం 7.50 గంటలకు, నాందేడ్ కు అర్థరాత్రి 12.50 గంటలకు, ఉదయం 7.30 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications