ఏపీ, తెలంగాణకు శుభవార్త
వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలు, కళాశాలలకు సెలవులివ్వడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళుతున్నారు. దీంతో రైళ్లల్లో రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
మే 27 నుంచి జూన్ 24 వరకు సంబల్‌పూర్-కాచిగూడ రైలు నడుస్తుంది. సంబల్‌పూర్‌లో రాత్రి 9.00 గంటలకు బయల్దేరి తర్వాతరోజు ఉదయం 3.30 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఉదయం 5.30 గంటలకు విజయనగరం, 7.20 గంటలకు దువ్వాడ, రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో మే 28 నుంచి జూన్ 25 వరకు నడుస్తుంది. కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ, 1.50 గంటలకు విజయనగరం, సాయంత్రం 4.05 గంటలకు రాయగడకు, రాత్రి 11.45 గంటలకు సంబల్ పూర్ చేరుకుంటుంది.

సంబల్‌పూర్-ఎస్‌ఎంవీ బెంగళూరు స్పెషల్ ట్రైన్ మే 30 నుంచి జూన్ 27 వరకు నడవనుంది. సాయంత్రం 6.45 గంటలకు సంబల్ పూర్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 4.55 గంటలకు దువ్వాడ, రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడవనుంది. బర్‌గార్‌రోడ్డు, బలంగీర్, టిట్లాగడ్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.
రైళ్లల్లో రోజురోజుకు రద్దీ పెరుగుతుండటంతో ప్రయాణికులకు సరిపడే విధంగా అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. కాకపోతే ఇవి గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నాయని, క్రాసింగ్ కోసం పక్కన పెడుతున్నారని, ఛార్జీలు మాత్రం స్పెషల్ పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications