రేపు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా ? ఇది మీ కోసమే..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తిరుపతి-చర్లపల్లి స్టేషన్ల మధ్య రేపు ప్రయాణించే ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అసలే వేసవి ఉక్కపోత, రైళ్లన్నీ రద్దీ. ఇలాంటి నేపథ్యంలో తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడపాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఛార్జీలు, హాల్ట్ ఇచ్చే స్టేషన్ల వివరాలను కూడా అధికారులు విడుదల చేశారు. కాబట్టి ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే వారు వీటిని గమనించాల్సి ఉంటుంది.

వేసవి రద్దీ నేపథ్యంలో తిరుపతి నుంచి చర్లపల్లికి నడిపే ప్రత్యేక రైలుకు 30 శాతం అదనపు ఛార్జీ ఉంటుంది. అలాగే తిరుపతిలో సాయంత్రం 4.55కు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, మహబాబాబాద్, నెక్కొండ, వరంగల్, కాజీపేట, జనగాం మీదుగా ప్రయాణించి ఎల్లుండి ఉదయం 6.10కి చర్లపల్లి చేరుకుంటుంది.

south central railway to run one-way summer special train from Tirupati to charlapalli tomorrow

ఈ ప్రత్యేక రైలుకు మిగతా అన్ని రైళ్ల తరహాలోనే ఐఆర్సీటీసీతో పాటు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటంది. కాబట్టి తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ ప్రత్యేక రైల్లో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి సీజన్ లో తిరుపతి నుంచి ప్రయాణాలు చేసే వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+