Travel Advisory: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే కీలక సూచన..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలు ప్రయాణికులకు అధికారులు ఇవాళ ట్రావెల్ అడ్వైజరీ (ప్రయాణ సూచన) విడుదల చేశారు. ఇందులో కొత్త ఏడాదిలో జరిగిన మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా మారిన రైల్వే సమయాలపై ప్రయాణికుల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సూచన విడుదల చేశారు. దీన్ని కచ్చితంగా దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు కోరుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఎక్కే ముందు సవరించిన రైలు సమయాలను ఓసారి సరి చూసుకోవాలని విజయవాడ డివిజన్ అధికారులు ఇవాళ ఓ సూచన విడుదల చేశారు. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే విధంగా అనేక రైలు సమయాలలో మార్పులు జరిగాయని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే కొత్త పబ్లిక్ టైమ్ టేబుల్ జనవరి 1, 2025 నుండి అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు.

south central railway Vijayawada division travel advisory to passengers in wake of timings change

సవరించిన టైమ్ టేబుల్ ప్రకారం, విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయని అధికారులు తెలిపారు. 1 జనవరి, 2025 నుండి ప్రయాణించే ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అసలైన రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. సవరించిన రైలు సమయాలు, షెడ్యూల్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయాణికులకు మూడు అధికారిక ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

south central railway Vijayawada division travel advisory to passengers in wake of timings change

ఇందులో ఒకటి ఐఆర్సీటీసీ వెబ్ సెట్ కాగా, రెండవది రైల్వే ఫోన్ ఎంక్వైరీ, మూడవది సంబంధిత రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ కౌంటర్ లేదా స్టేషన్ మేనేజర్. ఇందులో ఏదో ఒక రూపంలో ప్రయాణికులు తమ రైలు సమయాల్ని చెక్ చేసుకుని రైళ్లు ఎక్కాలని అధికారులు సూచిస్తున్నారు. సవరించిన రైలు సమయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కోరుతున్నారరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+