వందేభారత్ రిజర్వేన్ ప్రారంభం - భారీ డిమాండ్ : ఛార్జీల వివరాలు ఇలా - అఫీషియల్..!!

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ పట్టాలెక్కనుంది. మరి కొద్ది గంటల్లో ప్రధాని మోదీ వర్చ్యువల్ విధానంలో వందేభారత్ ను ప్రారంభించనున్నారు. ప్రతీ రోజు ఉదయం విశాఖ నుంచి బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకోనుంది. ఈ రైలుకు సంబంధించి ఏ స్టేషన్లలో ఆగేదీ..టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. సెలవులు పూర్తయ్యే వేళ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

అందుబాటులోకి రిజర్వేషన్

అందుబాటులోకి రిజర్వేషన్

వందేభారత్ రైలు రేపు సంక్రాంతి నాడు పట్టాలెక్కనుంది. అధికారికంగా 16వ తేదీ నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. తొలి రోజున ట్రయిల్ రన్ తరహాలో అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ రైలు ప్రయాణం చేయనుంది. సికింద్రబాద్ స్టేషన్ లో ప్రారంభం అయ్యేలా ప్రధాని వర్చ్యువల్ విధానంలో ప్రారంభిస్తారు. సాయంత్రానికి విశాఖ చేరుకుంటుంది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించనుంది. వందేభారత్ రిజర్వేషన్ ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు నడవనుంది. ఉదయం 5.55 గంటలకు విశాఖలో బయల్దేరే వందేభారత్ కు నెంబర్ (20833) , అదే విధంగా మధ్నాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకొనే రైలు (20834) గా నెంబర్లు ఖరారు చేసారు. ఈ నెంబర్లతో రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభమైంది.

స్టేషన్ల మధ్య టికెట్ ధరలు ఇలా..

స్టేషన్ల మధ్య టికెట్ ధరలు ఇలా..

విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్‌ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది పాసింజర్స్ ప్రయాణానికి అవకాశం ఉంది. ఇక, టికెట్ ధరలను రైల్వే అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. చెయిర్ కార్ టికెట్ ధర బేస్ ఫేర్ రూ 1,206 కాగా, మొత్తంగా ఛార్జీ రూ 1,720గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ఛార్జీ రూ 3,170గా నిర్ణయించారు. సికింద్రాబాద్ టు వరంగల్ : రూ.520, సికింద్రాబాద్ టు ఖమ్మం ; రూ.750, సికింద్రాబాద్ టు విజయవాడ : రూ. 905, సికింద్రాబాద్ టు రాజమండ్రి ; రూ.1365
సికింద్రాబాద్ టు విశాఖపట్నం : రూ.1665 గా అధికారులు ప్రకటించారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభం అయింది. కాగా.. 18వ తేదీ నుంచి వందేభారత్ రైళ్లో ప్రయాణానికి టిక్కెట్ల రిజర్వేషన్లలో డిమాండ్ కనిపిస్తోంది. ధరల విషయంలో మాత్రం ప్రయాణీకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.

సౌకర్యాలు - వేగవంతంగా గమ్యస్థానాలకు

సౌకర్యాలు - వేగవంతంగా గమ్యస్థానాలకు

వందేభారత్ రైలు ఈ నెల 16వ తేదీ నుంచి ఉదయం 5.55 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అదే విధంగా తిరిగి సికింద్రాబాద్ లో 3 గంటలకు ప్రారంభమై రాత్రికి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది. వందే భారత్ ట్రైన్ రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఇప్పటికే ఈ మార్గంలో పలు రైళ్లు నడుస్తున్నా.. అన్నింటికీ భారీ డిమాండ్ కనిపిస్తోంది. వందేభారత్ ద్వారా ఇతర రైళ్లు..దురంతో కంటే వేగంగా గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం ఏర్పడింది. ఇప్పుడే రిజర్వేషన్లు ప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ప్రయాణీకుల నుంచి ఎటువంటి ఆదరణ రానుందనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+