బాబుతో సౌతిండియా సినీ ప్రముఖులు, ఏపీ కొత్త స్కీం

హైదరాబాద్/కడప: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం దక్షిణ భారత సినీరంగ ప్రముఖులు కలిశారు. ఏపీలో సినీరంగ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సినీరంగం అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు. విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మండిపడ్డ సునీత

వైయస్సార్ కాంగ్రెసు పైన మంత్రి పరిటాల సునీత మంగళవారం ధ్వజమెత్తారు. ఆమె కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతుల రుణమాఫీ పైన విపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కోట్లు దోచుకున్న వారు మాపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

South Indian cine celebrities meet Chandrababu

అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. పేదలకు బియ్యం సకాలంలో అందకపోతే డీలర్లను సస్పెండ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. గోదాములలో రూ.50 లక్షల విలువైన చింతపండు వృథాగా పడి పోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వం కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకు రానుంది. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకాన్ని తీసుకు రానున్నట్లు మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతలు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ఖజానా ఖాళీ చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్టీకి తమను విమర్శించే నైతికత లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+