Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చల్లటి వార్త... ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై ఇవి విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాలపై ప్రస్తుతం రుతుపవనాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని, రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడతాయని పేర్కొంది.

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో ఏర్పడే వాతావరణాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని మరి కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఆదివారంనాడు విస్తరించాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణవైపు గాలులు వీస్తున్నాయి.

 cyclone

ఆది, సోమవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా వడగాలలు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, కుమురం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారంనాడు, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీమ్, ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+