రుతుపవనాల పై గుడ్ న్యూస్, మనకు ఎప్పుడంటే- ఇక వర్షాలు..!!

రుతుపవనాల కదలిక పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతు న్నాయి. పలు ప్రాంతాలు ఎండ తీవ్రతకు ఉడికిపోతు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావం తో వర్షాలు పడుతున్నాయి. కాగా.. ఈ సారి రుతుపవనాలు ముందస్తుగానే అండమాన్ చేరుకున్నాయి. 26వ తేదీ కేరళలో ప్రవేశిస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో.. ఎండ తీవ్రత నుంచి త్వరలోనే బయట పడతామని భావించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం తేదీ పైన తాజాగా అప్డేట్ వచ్చింది.

నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితు ల ప్రకారం ఈ నెల 31-జూన్‌ 2 మధ్య కేరళను తాకే అవకాశముందని వెల్లడించింది. అయితే, వడగాలుల ప్రభావం మరింత పెరిగితే రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చని పేర్కొంది. తెలంగాణకు జూన్‌ రెండోవారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
southwest-monsoon-s-journey-across-india-is-expected-to-begin-around-june-1-in-kerala-as-imd-latest

జూన్ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి

ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రంలో ప్రవేశించాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇక ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర జార్ఖండ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒడిశా మీదుగా విస్తరించి, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అలాగే ఉత్తర తమిళనాడు తీరం మరియు పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ స్పష్టం చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+