Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో జగన్‌కు సైకిల్ సంఘీభావం - టీమ్ అంబానీ వర్కింగ్..!!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఇవాళ ఆ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు ఇండియా కూటమిలో కీలకమైన సమాజ్ వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న వైసీపీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ఎన్డీయే కూటమి సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో వైసీపీ నిరసన కార్యక్రమం, ఫోటో గ్యాలరీని సందర్శించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. అనంతరం ఈ కార్యక్రమానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాకు ఆహ్వానించినందుకు జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికి తాను రాకపోయుంటే చాలా విషయాలు తెలిసేవి కావన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ఇవన్నీ చూసిన తర్వాత తానో విషయం స్పష్టం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

SP chief Akhilesh Yadav extends support to ys jagan s deeksha in delhi against Chandrababu regime

అ«ధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని, ప్రజల సమస్యలు పట్టించుకోవాలని అఖిలేష్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఎదుటివారు చెప్పేది వినాలని, అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైందన్నారు.
పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

నిన్నటి వరకు జగన్ సీఎంగా ఉన్నారని, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారని, రేపు మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి కావొచ్చన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్‌ సంస్కృతిని తమ సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదన్నారు. దాన్ని తప్పు పడుతున్నట్లు తెలిపారు. చివరకు ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్‌ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారని ప్రశ్నించారు. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదన్నారు.

ప్రజలు సంతోషంగా జీవించాలని, ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో, వారు మంచి ముఖ్యమంత్రి కారన్నారు. అలాగే అది సుపరిపాలన కాదు. మంచి ప్రభుత్వం కాదన్నారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ఆ పని చేసే వాళ్లు ఎక్కువ కాలంఏపీలో అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని జగన్ ను ప్రశంసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఇది గొప్ప విషయమన్నారు. జగన్‌ కూడా ఎప్పుడూ కార్యకర్తలతో మమేకం అవుతారని, అలాంటి నాయకుడు ఈరోజు, తమ కార్యకర్తలో కోసం పోరాడుతున్నారన్నారు. రేపు వారే పోరాడి, మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారన్నారు.

ఏపీలో సాగుతున్న విధ్వంసాన్ని అందరికీ చూపాలని వైసీపీ కార్యకర్తలకు అఖిలేష్ సూచించారు. బుల్డోజర్‌ సంస్కృతి అనేది ఎప్పుడూ, ఎక్కడా మంచిది కాదన్నారు. తాము యూపీలో దాన్ని చూశామని, వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని చూశామన్నారు. అంత కంటే మరో దారుణం కూడా చూశామని, అది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అన్నారు. ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ జరిగిందన్నారు. ఎవరైనా పోలీస్‌ కస్టడీ సురక్షితం అనుకుంటారని, కానీ, తమ దగ్గర ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ చేశారన్నారు.

ఏపీలో వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, అదే పరిస్థితి యూపీలో కూడా చూశామన్నారు. తమకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా కూడా.. ప్రభుత్వంతో పోరాడామన్నారు. అంతేకానీ, ప్రభుత్వం ముందు తల వంచలేదన్నారు.ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు గెల్చారని గుర్తుచేసారు. కాంగ్రెస్‌ నుంచి కూడా ఆరుగురిని గెలిపించామన్నారు. ప్రజల వెంట ఉన్నవారిని, వారు ఎప్పుడైనా ఆదరిస్తారన్నారు. కాబట్టి, రేపు జగన్ ను వారే గెలిపించుకుంటారన్నారు.

బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలని, నేరమయ రాజకీయాలు చేయకూడదని అఖిలేష్ సూచించారు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దన్నారు. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా తామెప్పుడూ పోరాడతాం. అలాంటి వారికి అండగా నిలబడతామన్నారు.

జగన్‌కు మద్దతుగా అంబానీ ఆప్తుడు

మరో వైపు జంతర్ మంతర్ వేదికగా జగన్ తలపెట్టిన ధర్నాలో అంబానీ ఆప్తుడు, సన్నిహితుడు రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ కూడా సంఘీభావం తెలిపారు. ఆయన ధర్నా వేదిక వద్ద కనిపించడంతో అంబానీ టీమ్ కూడా జగన్‌కు అండగా నిలుస్తోందన్న సంకేతాలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+