అసెంబ్లీకి రాకపోతే, ఇక - అయ్యన్న..!!
ఏపీకి ఎమ్మెల్యేల గైర్హాజరు పైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష వైసీపీ సభకు గైర్హాజరవుతోంది. తాము ఏకైక ప్రతిపక్షం గా ఉన్నామని.. తమకు అసెంబ్లీలో హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. దీని పైన కోర్టులోనూ కేసు కొనసాగుతోంది. ఈ సమయంలో మరోసారి స్పీకర్ అయ్యన్న ఎమ్మెల్యేలు సభకు రాకపోవటం పైన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
పలువురు సభ్యులు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ జీతం తీసుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో అయ్యన్నపాత్రుడు పాల్గొని ప్రసంగించారు. ప్రజలు మనల్నిఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రజా స మస్యలు పరిష్కరించడానికి అని అయ్యన్న వవరించారు. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నామ ని పేర్కొన్నారు. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే తక్కువ రోజులని.. వాటికి కూడా రాకపోతే ఎలా అని అయ్యన్న ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలనే నిబంధన తప్పనిసరి చేయాలని చెప్పుకొచ్చారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని ఉద్ఘాటించారు. మహిళల ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నొక్కి చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు గురించి చట్టం చేశారని గుర్తుచేశారు. ఉద్యోగాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడించారు. ఒక మహిళను అసెంబ్లీకి స్పీకర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. తిరుపతిలో మహిళ యూనివర్సిటీని పెట్టింది కూడా ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఇక.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో జగన్ నిర్ణయం మార్చుకుంటారా.. గైర్హాజరుకే కట్టుబడి ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications