రూల్స్ తెల్సుకోవాలని జగన్ పార్టీకి స్పీకర్, బాబుపై ఫైర్

Nadendla Manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభలోని నిబంధనలు తెలుసుకోవాలని సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం సూచించారు. ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం అయిన తర్వాత సభాపతి విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కోసం పట్టుబడుతూ నినాదాలు చేశారు... స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో గందరగోళం ఏర్పడింది.

దీంతో సభ నియమాలు తెలుసుకోవాలని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరిగితే మీకే స్పష్టత వస్తుందని, పోడియాన్ని చుట్టుముట్ట వద్దని స్పీకర్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. అయినా వారు వెనక్కి తగ్గక పోవడంతో సభాపతి సభను అరగంటపాటు వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన అనంతరం సీమాంధ్ర టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. సభలో సీమాంధ్ర వాయిస్ లేకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో తమ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. చర్చ ముగిశాక ఓటింగ్ కోసం పట్టుబట్టవచ్చునని తెలిపారు.

ఓటింగ్ పెడితే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం బయటపడుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించింది. తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పార్టీని కాపాడుకునేందుకు టిడిపి యత్నిస్తోందన్నారు. ఓటింగ్ పెట్టాల్సిందేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+