స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఆత్మహత్య: డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

విజయవాడ: విజయనగరంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తు్న మార్కొండ పట్నాయకుని చనిన్ని కృష్ణారావు (43) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వై పోలీసుల కథనం ప్రకారం - సీతానగరం మండల కేంద్రానికి చెందిన చిన్ని కృష్ణారావు 1993లో పోలీసు కానిస్టేబుల్‌గా చేరి, 2010లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2014లో ఎస్ఐగా ప్రమోషన్ పొందారు.

గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, కుమారుడు రాకే,్ (17) ఉన్నారు. కుమారుడు హైదరాబాదులోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఇదిలావుంటే, కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన నాగమల్లీశ్వరి (20) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. శనివారం ఉదయం ఆమె ఇంట్లో ఉరి వేసుకుని మరణఇంచింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Special branch SI Chinni Krishna Rao commits suicide

చేనేత కార్మికురాలి ఆత్మహత్య

అప్పుల భారం పెరిగి ఓ చేనేత కార్మికురాలు అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన నర్సింహులు, గోవిందమ్మ (37) దంపతులు చేనేత కార్మికురాలు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.

నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. దాంతో ఇటీవలికాలంలో పనులు దొరకడం కష్టంగా మారింది. దాంతో దాదాపు రూ. 3లక్షల మేరకు అప్పులు చేశారు కుటుంబం గడవడం కష్టం కావడంతో గోవిందమ్మ శనివారం తెల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకుని మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+