విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రాపైనే మా దృష్టి, భారత్‌తో చారిత్రక సంబంధాలు: కొరియన్ ప్రతినిధులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత్-కొరియా మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు తాము సుముఖంగా ఉన్నామని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్‌ఇ జాన్‌గ్యూ లీ అన్నారు. మంగళవారం నగరంలో రిపబ్లిక్ కొరియా, డిల్లీ రాయబార కార్యాలయం ప్రతినిధులతో ‘కొరియా కారవన్-2015' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌తో కొరియాకు చారిత్రక సంబంధాలున్నాయని తెలిపారు. కొరియా ఏర్పాటులో భారత్ పాత్ర కీలకమని తెలిపరాు.వాణిజ్యపరంగానూ, స్మార్ట్ సిటీల నిర్మాణానికి నవ్యాంధ్ర అనుకూలమైందన్నారు.

పెట్టుబడులు పెట్టేందుకు కొరియా సంస్థలు సుముఖంగా ఉన్నాయని, తమ మొదటి ప్రాధాన్యత ఆంధ్రాకే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అవసరమైన చర్యలను చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్ర విభజన తరువాత అతికొద్ది కాలంలోనే పెట్టుబడుల్లో దేశంలో నవ్యాంధ్ర మూడో స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్‌లో రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రతినిధులతో సమావేశం కానుండటంతో ఇక్కడకు రాలేకపోయారని చెప్పారు. అలాగే దేశంలో గుజరాత్ తరువాత అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం తమదేనని అన్నారు.ఇక్కడ కొత్త పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పెట్టుబడులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఐటి మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఐటి రంగం ఊపందుకుందన్నారు. విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌తో ఏడు మిషన్లను అభివృద్ధి చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

భారత్-కొరియా మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు తాము సుముఖంగా ఉన్నామని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్‌ఇ జాన్‌గ్యూ లీ అన్నారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

మంగళవారం నగరంలో రిపబ్లిక్ కొరియా, డిల్లీ రాయబార కార్యాలయం ప్రతినిధులతో ‘కొరియా కారవన్-2015' కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాణిజ్యపరంగానూ, స్మార్ట్ సిటీల నిర్మాణానికి నవ్యాంధ్ర అనుకూలమైందన్నారు. తమ మొదటి ప్రాధాన్యత ఆంధ్రాకే ఉంటుందని తెలిపారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'


రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అవసరమైన చర్యలను చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ సందర్భంగా చెప్పారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

రాష్ట్ర విభజన తరువాత అతికొద్ది కాలంలోనే పెట్టుబడుల్లో దేశంలో నవ్యాంధ్ర మూడో స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్‌లో రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రతినిధులతో సమావేశం కానుండటంతో ఇక్కడకు రాలేకపోయారని చెప్పారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

అలాగే దేశంలో గుజరాత్ తరువాత అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం తమదేనని అన్నారు.ఇక్కడ కొత్త పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

‘కొరియా కారవన్-2015'

‘కొరియా కారవన్-2015'

పెట్టుబడులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఐటి మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఐటి రంగం ఊపందుకుందన్నారు.

రానున్న కాలంలో ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌లో 4 లక్షల మందికి ఉద్యోగాలు లభించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఒక్క అమెరికా నుంచి 52 సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు.

రానున్న మూడేళ్లలో మెట్రోరైలు నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత విశాఖకు పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి ఏరియల్ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. 4జి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రానున్న కాలంలో అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలను అనుసంధానం చేసి సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

అంతేగాకుండా ఎల్‌జి, శాంసంగ్ వంటి కొరియా కంపెనీల ఫ్రాంచైజ్‌లను విశాఖలో ఏర్పాటు చేయాలని కోరినట్టు ఆయన వివరించారు. అనంతరం కొరియా సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. అంతేగాకుండా కొరియా కంపెనీలకు చెందిన పలు వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కొరియా, భారత్ రాయబార కార్యాలయ ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
Ambassador of the Republic of Korea Joongyu Lee said that his country considered Andhra Pradesh as the State with good potential for investment in various sectors. AP is one of the progressive and forward-looking States of India and drawing world’s attention to its vast opportunities, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X