TTD: అక్టోబర్ నెలలో తిరుమల వచ్చే వారికి టీటీడీ కీలక అప్డేట్..!!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాల తో పాటుగా దసరా పండుగ.. వరుల సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. అక్టోబర్ 2వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక.. అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలను ప్రకటించింది.
అక్టోబర్ నెలలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజారోహణంతో ముగియనున్నాయి. ఇక.. అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను వెల్లడించిన టీటీడీ అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనుంది. అక్టోబర్ 3న శ్రీవారి బాగ్ సవారి నిర్వహించనున్నారు. అక్టోబర్ 07న పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. అక్టోబర్15న తిరుమల నంబి ఉత్సవారంభం మొదలు కానుంది.

అదే విధంగా అక్టోబర్ 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. దీపావళి సందర్భంగా ప్రతీ ఏటా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. అక్టోబర్ 23న భగినీహస్త భోజనం... అక్టోబర్ 24న తిరుమలనంబి శాత్తుమొర.. అక్టోబర్ 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం నిర్వహణ పైన స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 27న మానవాళ మహామునుల శాత్తుమొర...అక్టోబర్ 28న సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం... అక్టోబర్ 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ... అక్టోబర్ 30న తిరుమల శ్రీవారి పుఫ్పయాగం... అక్టబర్ 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతి నిర్వహించనునున్నట్లు టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications