ప్రధానితో వేదిక పై వారికే ఛాన్స్ - తరలి వచ్చిన ప్రముఖులు..!!
అమరావతి జనసంద్రంగా మారుతోంది. అమరావతి పనుల రీ లాంఛ్ వేడుక కు సర్వం సిద్దం అయింది. గన్నవరంలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో అమరావతి వేదిక వద్దకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ ప్రధానికి అమరావతిలో స్వాగతం పలకనున్నారు. సభా వేదిక ఇప్పటికే సిద్దమైంది. కాగా, ప్రధాని తో సహా ప్రధాన వేదిక పైన 14 మందికే అవకాశం కల్పించారు. ఇక, ఈ ఘట్టానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు.
ప్రధానికి ఘన స్వాగతం
అమరావతి కేంద్రంగా కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. ప్రధాని మోదీ ఏపీ రాజధాని పనుల రీ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వం ప్రధాని సభకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని పర్యటన వేళ అమరావతి పనుల పునర్నిర్మాణ పునర్నిర్మాణ పనుల ప్రారంభా నికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ పైలాన్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సభకు భారీగా హాజరయ్యే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది.ధాని మోదీ లక్ష కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

A ఆకారంలో పైలాన్
అమరావతి పనుల ప్రారంభానికి గుర్తు గా 20 అడుగుల ఎత్తులో A ఆకారం లో సిద్దం చేసి పైలాన్ ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇది 'A' అక్షరాకారంలో, 21 అడుగుల ఎత్తుతో, పూర్తి గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇది రాజధాని పునఃనిర్మాణానికి ప్రతీకగా నిలవనుంది. అమరావతి పేరు తొలి అక్షరం 'A' రూపకల్పనకు ప్రేరణగా ఉపయోగించారు. ఈ పైలాన్ తాత్కాలికంగా కాదు, శాశ్వత గుర్తుగా మిగిలేలా నిర్మిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యంగా కృష్ణా జిల్లా నాగాయ లంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశ రక్షణ రంగంలో భారీ పురోగతికి దారి తీసే అవకాశం ఉంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి దక్కింది.
ప్రధానితో వేదికపై
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి దక్కింది. గవర్నర్ అబ్డుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో సహా చిరంజీవికి అవకాశం కల్పించారు. చిరంజీవికి ప్రత్యేక అతిథి హోదాలో ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, అమరావతి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్నారు. పైలాన్ తో పాటుగా పనుల ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సభలో చేసే ప్రసంగం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications