వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ: 'జగన్! ఇదేం పద్ధతి, అందర్నీ సస్పెండ్ చేయండి', హక్కుంది కానీ.. టిడిపి నేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. వైసిపి ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. వైసిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో ప్రారంభంలోనే గందరగోళం ఏర్పడింది. పోడియం వద్ద నిరసన తెలిపారు. వైసిపి ఎమ్మెల్యేలు నల్లటి దుస్తులతో సభకు వచ్చారు.

- మధ్యాహ్నం సీఎం ప్రకటన
అసెంబ్లీలో వైసీపీ హోదా కోసం పట్టుబట్టడం, సభ పలుమార్లు వాయిదా పడటం, ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనల నేపథ్యంలో.. చంద్రబాబు కేంద్ర సాయం ప్రకటన పైన మధ్యాహ్నం ఒకటి గంటలకు మాట్లాడనున్నారు.

- సభ రెండోసారి వాయిదా
వైసిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో సభలో గందరగోళం కొనసాగింది. దీంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు.

- స్పీకర్ పోడియం వద్ద చప్పట్లా: యనమల
వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద చప్పట్లు కొట్టడం సరికాదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మరో టిడిపి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందర్నీ సస్పెండ్ చేయాలన్నారు.

- సస్పెండ్ చేయండి: విష్ణు

బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. వీరు సభా మర్యాదను మంటగలిపేలా చేస్తున్నారన్నారు. మీ సీటు (స్పీకర్) పక్కన ఇలా నిల్చుంటే మీరు బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా ఉందన్నారు. జగన్‌ను నేను కోరుతున్నానని.. మీ సభ్యులను స్పీకర్ సీటు నుంచి పక్కకు తీసుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. దేనికైనా లిమిట్ ఉంటుందన్నారు. వారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నానని చెప్పారు. వీరు చేసే దురాగతాన్ని అందరు చూస్తున్నారన్నారు. ఇది సభ్యత కాదని జగన్‌కు చెబుతున్నానన్నారు. ఇంతకంటే దారుణం లేదన్నారు. మీ అంత (స్పీకర్) ఓపిగ్గా మిగిలిన వారు ఉండరన్నారు. కానీ మీరు వారి (వైసిపి) చర్యలతో చాలా ఓపిగ్గా ఉంటున్నారన్నారు. వారిని సస్పెండ్ చేయకుంటే మేం కూడా వెల్ లోకి వస్తామన్నారు.
- యనమల మాట్లాడుతూ.. పోడియం వద్దకు వెళ్లి ఇలా చేయడం సరికాదన్నారు.
- ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు.
- ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్‌కు మాట్లాడే హక్కు ఉందన్నారు. కానీ నియంతృత్వ ధోరణి సరికాదన్నారు.
- సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా వైసిపి సభ్యులు పోడియం వద్దే బైఠాయించారు. విపక్ష ఎమ్మెల్యేల నిరసన మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

- తిరిగి ప్రారంభమైన సభ

వాయిదా అనంతరం సభ తిరిగి పది నలభై అయిదు నిమిషాలకు ప్రారంభమైంది.

- సీనియర్ మంత్రులతో చంద్రబాబు భేటీ

సభలో వైసిపి నేతల నినాదాలు, సభ వాయిదా నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన చంద్రబాబు సీనియర్ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సభలో ఎలా నడుచుకోవాలో చర్చించారు.

- వచ్చేసారి అమరావతిలో సమావేశాలు: కాల్వ

వచ్చేసారి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రోజుకు పది గంటల పాటు సభను జరుపుకుందామని, విపక్షం సహకరించాలని కోరారు. గతంలో జరిగిన ఏ సమావేశాల్లోను వైసిపి సమస్యలపై చర్చకు ముందుకు రాలేదన్నారు. విలువైన సభా సమయం వృథా చేయవద్దన్నారు.

- సభ వాయిదా

ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పినప్పటికీ వైసిపి సభ్యులు నిరసనలు ఆపలేదు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభాపతి కోడెల శివప్రసాద రావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

- చంద్రబాబు స్వాగతించలేదు: అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిన్నటి ప్రకటనను ఆంధ్రులంతా చూశారని, దానిపై లాభ నష్టాలను సభకు తెలియజేయాల్సి ఉందని చెప్పారు. మేం ప్రకటన చేస్తామని చెబితే వైసిపి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రకటన చేశాక మీరు ఏదైనా మాట్లాడవచ్చునని చెప్పారు.

చంద్రబాబు.. జైట్లీ ప్రకటనను స్వాగతించలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. 'ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాం.. హోదా కావాలని' సీఎం స్పష్టంగా ప్రకటించారన్నారు. ప్రకటన తర్వాత మీరు చెప్పాల్సింది చెప్పవచ్చునని అన్నారు. అందరు సహకరించాలన్నారు.

- జైట్లీ హోదా ఇవ్వమన్నారుగా..: జగన్
ఇదే చట్ట సభలో రెండుసార్లు హోదా కోసం తీర్మానం చేసి పంపించామని జగన్ అన్నారు. నిన్న జైట్లీ హోదా ఇవ్వమని ప్రకటించాక, చంద్రబాబు దానిని ఆహ్వానించడం ఏమిటని నిలదీశారు.

Special Status heat in Andhra Pradesh Assembly

- ఇది మంచి పద్ధతి కాదు: స్పీకర్
వైసిపి ఎమ్మెల్యేలు హోదా కోసం నినాదాలు చేస్తూ పోడియం వద్దకు రావడాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద రావు తప్పు పట్టారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉందని, అలాంటప్పుడు ఇలా రాద్దాంతం సరికాదన్నారు.

- సొంత పనులు: బోండా ఉమ తీవ్ర వ్యాఖ్య
ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. హోదా పైన కేంద్రం పైన తాము అనేక రకాలుకా ఒత్తిడి తెస్తున్నామన్నారు. వైసిపికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోడీ ఇంటి వద్ద ఆందోళన చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ రాద్దాంతం చేస్తున్నారన్నారు.

ఇక్కడ ఆందోళన చేసి, ఢిల్లీలో సున్నితంగా జగన్ మాట్లాడుతారని, అందుకు ఆయనకు ఉన్న కేసులే కారణమని బోండా ఉమ అన్నారు. ఢిల్లీకి వెళ్లి సొంత పనులు చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. ఢిల్లీకి వెళ్లి రాజీ గురించి మాట్లాడుతారన్నారు.

- మీ అభ్యంతరాలు చెప్పవచ్చు: యనమల
ఎమ్మెల్యేల నినాదాలపై యనమల స్పందిస్తూ... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన పైన సభలో ప్రకటన చేస్తామన్నారు. దీనిపై మీ అభ్యంతరాలు చెప్పవచ్చన్నారు.

- సభ ప్రారంభం
గురువారం ఉదయం సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. వైసిపి ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. పోడియం వద్ద నిరసన తెలిపారు. అంతకుముందు వైసిపి హోదా కోసం చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చింది.

English summary
Special Status heat in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X