Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులు 'నో' చెప్పినా, రన్ వేపై బైఠాయింపు: ఎయిర్ పోర్టులోనే జగన్ నిర్బంధం

ఆర్కే బీచ్‌లో జరగనున్న క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన వైసిపి అధినేత వైయస్ జగన్‌ను విమానం దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కాసేపు విమానాశ్రయంలోనే బైఠాయించారు.

విశాఖ: ఆర్కే బీచ్‌లో జరగనున్న క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమానం దిగగానే పోలీసులు అడ్డుకొని, ఆ తర్వాత నిర్బంధించారు.

జగన్ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. ఆయన విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అడ్డగించారు. ఆర్కే బీచ్‌లో నిరసనలకు అనుమతి లేదని తెలిపారు. జగన్, ఆయనతో పాటు వచ్చిన అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డిని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రన్ వే పైన బైఠాయించారు.

Special Status: Police stops YS Jagan at Vishaka Airport

విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ర్యాలీలకు అనుమతి లేదని ఎంతగా చెప్పినా జగన్ వినలేదు. దీంతో జగన్‌తో పాటు మిగిలిన వారిని పోలీసులు నిర్బంధించారు.

బొత్స అరెస్ట్

ఆంధ్రా యూనివర్సిటీ వద్ద వైసిపి నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను భీమిలి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎంపీ హర్షకుమార్‌ను మరోచోట అరెస్టు చేశారు.

మరోవైపు, యువకులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బీచ్‌లో ర్యాలీ చేపట్టిన.. ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్టణం చేరుకున్న రెడ్నమ్ గార్డెన్స్ మీదుగా పెద వాల్తేరు చేరుకుని, అక్కడున్న కాలనీ మీదుగా పాం బీచ్ వైపు ర్యాలీ ప్రారంభించారు. కొంతమంది యువకులు ఆయనను అనుసరిస్తూ ఆర్కే బీచ్ చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు పాం బీచ్ చేరుకునేసరికి విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఆయనను పెదవాల్తేరు బీచ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+