బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనం
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక హోదా విషయమై సంచలన వ్యాఖ్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా అవసరం లేదని, కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని ఆయన చెప్పారు.
రాయలసీమ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణ దవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బైరెడ్డి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతందని అబద్దాలు చెబుతున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పడం గమనార్హం.

ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతాం: తోట నర్సింహం
ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలుగుదేశం పార్టీ లోకసభ పక్ష నేత తోట నర్సింహం ఢిల్లీలో అన్నారు. విభజన చట్టంలో లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాల్సి ఉందని చెప్పారు.
ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోడీ ఎన్డీయే సమావేశం నిర్వహించి మిత్రపక్షాలకు గౌరవం ఇచ్చారని, తరుచూ ఇలాంటి సమావేశాలు జరగాలన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications