కుంభమేళా అసలు కథ ఏంటో తెలుసా?

కుంభమేళా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు ఒక ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా గుర్తింపు పొందిన ఈ మహా కుంభం, దాని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తోంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ కుంభమేళా విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కుంభమేళ పవిత్రత
కుంభమేళాలో స్నానం చేస్తే వంద జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వికులు చెబుతుంటారు. ఎందుకంటే మూడు నదులు కలిసే ప్రదేశంలో కుంభమేళా నిర్వహించినప్పుడు ఆ ప్రదేశంలోని నీరు అమృతంలా మారుతుందని, దీని కారణంగా అందులో స్నానం చేసే భక్తుల బాధలన్నీ పోతాయని నమ్ముతారు. అందుకే త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని చెబుతున్నారు.

special story on Kumbh Mela 2025

కుంభమేళా జరిగే ప్రధాన ప్రదేశాలు
కుంభమేళా మన దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది త్రివేణి సంగమం. ఆ నాలుగు ప్రధాన నగరాలు ఏవంటే

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్
మధ్యప్రదేశ్‌లో షిప్రా ఉజ్జయిని గంగా నది ఒడ్డున
మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద

త్రివేణి సంగమం కథ ఏంటి?
త్రివేణి సంగమం అనేది మూడు నదులు ఒకే చోట కలిసే ప్రత్యేక ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు నదులు మాత్రమే కలుస్తున్నాయి. గంగా మరియు యమునా నదులు ప్రస్తుతం ఇక్కడ కలుస్తాయి. కానీ సరస్వతి నది ఇప్పుడు ప్రవహించడం లేదు. కానీ విశ్వాసాల ప్రకారం, ఈ రెండు నదులలో స్నానం చేయడం ద్వారా సరస్వతి తల్లి మానవుల పాపాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

మహాకుంభమేళా సందర్భంగా ఈ త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అనారోగ్యం నయమవుతుందని కూడా నమ్ముతారు.

ఈ కుంభమేళా ఎందుకు ప్రత్యేకం?
ఈ ఏడాది మహా కుంభమేళా చాలా ప్రత్యేకం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా కావడం విశేషం. మహా కుంభమేళా 2025 144 సంవత్సరాల తర్వాత గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయికల వలన జరుగుతోంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఈ రోజు శుభప్రదమని నమ్ముతారు.

కుంభమేళా నాలుగు రకాలు
4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా
అర్ధ కుంభమేళా- 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
పూర్తి కుంభమేళా- 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
మహా కుంభమేళా- 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+