ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్, బాబు జాగ్రత్త: టెలికం సర్కిల్ ఏర్పాటు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక టెలికం సర్కిల్ ఏర్పాటు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ ప్రత్యేక టెలికం సర్కిల్ ఏర్పాటు కానుంది. పదమూడు జిల్లాలను కలిపి దీనిని ఏర్పాటు చేస్తారు. ఏపీ టెలికం సర్కిల్ సీజీఎంగా దామోదర్ నియమితులయ్యారు.

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపండి: కేంద్రానికి లేఖ

కాగా, గత ఏడాది ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డబ్బులతో సహా దొరికారు.

babu

దీని పైన కేసు నమోదయింది. రేవంత్ రెడ్డి సహా పలువురు టిడిపి నేతలు అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓటుకు నోటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌ను తెరపైకి తెచ్చింది.

ఓటుకు నోటు, జగన్‌కు షాకే: ఏడాదిలో తారుమారు, ఎవరికి లాభం?

తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఏపీ ప్రభుత్వం, ఏపీ టిడిపి నేతలు భగ్గుమన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే వరకు తెలంగాణ - ఏపీ ప్రభుత్వాల గొడవ వెళ్లింది. ఇప్పుడు, తమ ఫోన్లను ట్యాపింగ్ చేయకుండా టెలికం సర్కిల్ ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Special Telecome circle in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X