విజయవాడ, బందరు, ఖమ్మం, వరంగల్ ప్రజలకు ముఖ్య గమనిక
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నవాటిని పొడిగించారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
07185 మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి రాత్రి 11.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
07186 సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
కాజీపేట, వరంగల్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ స్టేషన్లలో ఆగుతుంది.

07481 తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
07482 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.
సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగించారు.
జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications