తిరుపతి, సికింద్రాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నంవారికి ముఖ్య గమనిక
పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతోపాటు వర్షాకాలం సీజన్ కావడంతో భారతీయ రైళ్లల్లో రద్దీ పెరుగుతోంది. ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, భుశనేశ్వర్ కు రెండురోజులపాటు రైళ్లను నడిపించనుంది.
నెంబర్ 07490 (సికింద్రాబాద్ - తిరుపతి) తిరుపతిలో 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి 13వతేదీ తెల్లవారుజామున 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

నెంబరు 07059 (భువనేశ్వర్ - సికింద్రాబాద్) 11వ తేదీ మధ్యాహ్నం 3.05 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి 13వ తేదీ తెల్లవారుజామున 3.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయగనరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం, బెర్హంపూర్, బలుగాన్, ఖుర్దారోడ్ స్టేషన్లలో ఆగుతుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లైన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. జనతాఖానా పేరుతో రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి రూ.20కే భోజనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా 4 స్టేషన్లలో దీన్ని అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications