విజయవాడ, కాకినాడ, నల్గొండ, హైదరాబాద్ వారికి ముఖ్య గమనిక
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా స్టాప్స్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టేషన్లకు తోడు అదనంగా మరో స్టేషన్ లో రైలు నిలిపేలా చర్యలు తీసుకుంది. ప్రయోగాత్మకంగా 6 నెలలపాటు 8 రైళ్లు కేటాయించిన స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల రద్దీ ఈ స్టేషన్ల నుంచి ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.ః
ఆగస్టు 23 నుంచి హుబ్లీ-హైదరాబాద్-హుబ్లీ మధ్య తిరిగే 17319, 17320 రైళ్లు హోత్గి స్టేషన్ లో ఆగనున్నాయి. ముంబయి-విశాఖ-ముంబయి, కాకినాడ-ముంబయి-కాకినాడ రైళ్లు కూడా క్యలాణ్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఆగస్టు 24 నుంచి విశాఖ-షిరిడీ-విశాఖ మధ్య తిరిగే వీక్లీ ఎక్స్ ప్రెస్ ను 1850, 18504 కోపర్ గాం స్టేషన్లలో ఆపనున్నారు.

కాకినాడటౌన్-లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 1 నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 20.10 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి తర్వాత ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లమీదగా రాకపోకలు సాగిస్తాయి. ఏసీ 3టైర్, ఏసీ టూటైర్, స్లీపర్ బోగీలతోపాటు జనరల్ బోగీలు కూడా ఉంటాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను మరికొద్దికాలం అధికారులు పొడిగించారు.












Click it and Unblock the Notifications