జగన్ పై ఆధ్యాత్మిక దాడి..! : హైందవ ద్వేషిగా ముద్రకు కుట్ర : నెపం మా పై నెట్టాలని..
వైసిపి అధినేత పై రాజకీయంగా దాడి కొనసాగుతూనే ఉంది. పాదయాత్ర ముగింపులో ఉన్న జగన్ పై కొత్తగా ఆధ్యాత్మి క దాడి చేయాలనే కుట్ర జరుగుతోందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ను హైందవ ద్వేషిగా ముద్ర వేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తిప్పి కొడతామంటున్నారు వైసిపి నేతలు..
కాలినడకన శ్రీవారి దర్శనానికి..
జగన్ పాదయాత్ర ఈ నెల 9న ఇచ్ఛాపురం లో ముగియనుంది. ఆ వెంటనే జగన్ తిరుపతి చేరుకొని కానినడకన తిరు మల చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. ఇదే సమయంలో జగన్ స్వామి వారి దర్శనానికి వెళ్తున్న సందర్భంలో కొందరు విద్రోహ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్దం అవుతున్నారనే సమచారం తమకు వచ్చిందని వైసిపి నేత భూమన కరుణాకర రెడ్డి ఆరోపిస్తున్నారు. కుట్రలో భాగంగా..జగన్ స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో హిందుత్వ దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. టిడిపి కార్యకర్తలో జై జగన్ నినాదాలు చేయించి, పార్టీ జెండాలు విసిరి నెపం తమ పై నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఇది చంద్రబాబు చేస్తున్న కుట్ర గా కరుణాకరరెడ్డి ఆరోపించారు.

హైందవ ద్వేషిగా ముద్ర వేసేందుకే..
జగన్ పై చేస్తున్న ఏ ప్రయత్నాలు ఫలించకనే..ఇప్పుడు ఈ కుట్రకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్వామివారికి ఏటా పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేస్తున్నారు. టిడిపి నేతలు . వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కూడా విఫలమైందని..కొన్ని కుట్రల ద్వారా హైందవ ద్వేషిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు అందరికి ముందే కుట్ర గురించి చెప్తున్నామన్నారు కరుణాకర రెడ్డి. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాల గురించి ముందే చెప్తున్నామంటునే... చంద్రబాబుకి దేవుడు కూడా రాజకీయ అవసరమేనని ఆరోపించారు. ఇప్పుడు కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలతో జగన్ తిరుమల యాత్ర పై అందరి దృష్టి నెలకొంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications